'భరత్ అనే నేను' సినిమా వచ్చే నెల ఏప్రిల్ 20న రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రొమోషన్స్ చాలా జాగ్రత్తగా చేస్తున్నారు చిత్ర యూనిట్. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ చూస్తే మీకే అర్ధం అవుతుంది ఈ సినిమాపై ఎంత అంచనాలు ఉన్నాయో అని.
టీజర్ రిలీజ్ అయిన రోజు నుండి ఏదొక రికార్డు క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మరో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకుంది. ప్రపంచంలో అత్యధిక లైక్స్ సంపాదించిన టీజర్లలో.. 'భరత్ అనే నేను' కు సెకండ్ ప్లేస్ దక్కింది. ఇప్పటి వరకు 6.40 లక్షల లైక్స్ తో 14 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించుకున్నాడు మహేష్.
టాలీవుడ్ రికార్డును ఎప్పుడో తుడిచి పెట్టేసిన భరత్ అనే నేను.. ఇప్పుడు ఏకంగా వరల్డ్ రికార్డుల్లో సెకండ్ ప్లేస్ కు చేరుకుంది. అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న చిత్రం సౌత్ ఇండియన్ సినిమా కావడం విశేషం. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లేటెస్ట్ మూవీ 'మెర్సల్' టీజర్ కు 38 మిలియన్ల వ్యూస్ రాగా.. 10 లక్షలకు పైగా లైక్స్ దక్కాయి. ఆ తర్వాతి స్థానం భరత్ అనే నేనుకే దక్కింది. చూద్దాం ఈ టీజర్ ఇంకెన్ని రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో.