తెలుగులో ప్రస్తుతం రాశిఖన్నా మేనియా నడుస్తోంది. నిన్నమొన్నటివరకు ఆమె మామూలు కమర్షియల్ చిత్రాలలో తళుక్కున మెరిసి మాయమయ్యే సగటు హీరోయిన్ మాత్రమే. కానీ 'తొలిప్రేమ' చిత్రం ఆమెలోని టాలెంట్‌ని, పెర్ఫార్మన్‌ని బయట పెట్టడమే కాదు.. ఆమె కెరీర్‌ను 'తొలిప్రేమ' ముందు, 'తొలిప్రేమ' తర్వాత అని విభజించుకోవాల్సిన పని ఉంది. ఇక ఈమె ప్రస్తుతం నితిన్‌తో 'శ్రీనివాసకళ్యాణం' చిత్రాన్ని దిల్‌రాజు బేనర్‌లో సతీష్‌వేగ్నేష్ దర్శకత్వంలో నటిస్తోంది. దీంతో పాటు మరో రెండు చిత్రాలకు ఆమె ఓకే చెప్పింది. మరోవైపు ఈమె హవా కోలీవుడ్‌లో కూడా సాగుతోంది. ఇప్పటికే అక్కడ అధర్వ, సిద్దార్ధ్, జయం రవిల సరసన నటిస్తోంది. ఇక తాజాగా విశాల్ హీరోగా తెలుగు 'టెంపర్'కి రీమేక్‌లో కాజల్ పాత్రను పోషిస్తోంది. ఇక విషయానికి వస్తే గత కొంతకాలంగా రాశిఖన్నా ఇండియన్ క్రికెట్ టీంలోకి కీలకమైన ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాతో తిరుగుతోందని, ఇద్దరు డేటింగ్ చేస్తున్నారని, త్వరలో వీరి వివాహం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. ఇక బాలీవుడ్ నటులకు, క్రికెట్ క్రీడాకారులకు మధ్య ఎఫైర్లు పెళ్లిలు ఈనాటివి కావు. నవాబు పటౌడి-షర్మిలా ఠాగూర్ నుంచి రవిశాస్త్రి-అమృతాసింగ్, కపిల్‌దేవ్-సారిక, కపిల్‌దేవ్-జయసుధ, కపిల్‌దేవ్-సుమలత, ఇమ్రాన్‌ఖాన్, వస్రీం అక్రమ్ నుంచి వివియన్ రిచర్డ్స్-నీనా గుప్తాల వరకు ఈ తతంతం సాగుతోంది. ధోని, రాయ్‌లక్ష్మి నుంచి ఇటీవల హార్దిక్ పాండ్యా వరకు ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
ఇక రాశిఖన్నాకి బుమ్రాతో ఎఫైర్ గురించి రాశిఖన్నా క్లారిటీ ఇచ్చింది. మరీ బుమ్రా ఎవరో నాకు తెలియదు అని అనకుండా బుమ్రా ఓ క్రికెటర్‌గానే నాకు తెలుసు. ఆయనను వ్యక్తిగతంగా కూడా ఇప్పటివరకు కలవలేదు. అంతకు మించి ఆయన గురించి నాకేమీ తెలియదు. అతని మ్యాచ్‌లు కూడా నేను చూడలేదు. కొన్ని హిందీ వెబ్‌సైట్స్ వీటిని రాశాయి. ఇలాంటి రూమర్స్ చికాకుని కలిగిస్తాయని చెప్పుకొచ్చింది. ఇక ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ స్టార్ అనుష్కశర్మలు కూడా తమ ఎఫైర్ మొదట్లో తమకి ఎవరికి వారు ఎరుగమని చెప్పారు. పెళ్లి కూడా ఉత్తిమాటే అని చెబుతూ, ఇటలీ వెళ్లి మరీ వివాహం చేసుకుని తర్వాత మీడియాకి తెలిపారు. ఈ విషయాన్ని ముందు నుంచి మీడియా చెబుతూనే ఉంది. ఇప్పుడు రాశిఖన్నా వ్యాఖ్యలు కూడా అవే కోవకి చెందినవా? లేక ఆమె చెప్పేది నిజమా? అనేది తెలియడం లేదు. అయినా పోయి పోయి బుమ్రాకి రాశిఖన్నాతో ముడిపెట్టారంటే నిప్పులేనిదే పొగరాదనే విషయం నిజమేమో అనిపిస్తోంది.