Advertisement
Google Ads BL

ఫ్యాన్స్‌ని ఖుషీ చేసిన నమ్రత!


మహేష్‌బాబు, కృష్ణ నటించిన 'వంశీ' చిత్రంలో మహేష్‌కి జోడీగా నమ్రతా నటించింది. తర్వాత చిరంజీవితో 'అంజి'లో యాక్ట్‌ చేసింది. మహేష్‌, నమ్రతాలు ప్రేమించి నాడు పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ఈమె కూడా సామాన్యమైన మహిళ కాదు. ఈమెకి వేలకోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక మహేష్‌బాబు నిత్యం సినిమాలు, యాడ్స్‌, ఇతర విషయాలలో బిజీగా ఉంటాడు. దాంతో మహేష్‌కి చెందిన సినిమా అప్‌డేట్స్‌, ఫొటోలు, వెకేషన్స్‌కి విదేశాలకు వెళ్లినప్పటి ఫొటోలు, తమ పిల్లలు గౌతమ్‌ కృష్ణ, సితారల ఫొటోలను కూడా ఈమె సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. దాంతో ఆమె అకౌంట్స్‌ని ఫాలో అయ్యేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక తాజాగా మహేష్‌ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'భరత్‌ అనే నేను' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ చివరకు వచ్చేసింది. దాంతో తాజాగా షూటింగ్‌ స్పాట్‌లోనే మహేష్‌ తన అభిమానులను కలుస్తూ, ఫొటోలు తీసుకుంటూ మరోవైపు షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇక మహేష్‌ 'భరత్‌ అనే నేను' షూటింగ్‌కి వచ్చే సమయంలో, వెళ్లే సమయంలో పలువురు అభిమానులు గుమ్మికూడి ఆయనను వీడియోలలో బంధించే పని చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఈ వీడియోని ఆమె తన అకౌంట్‌లో షేర్‌ చేసింది. ఒక్క మనిషి కోసం ఇంత ప్రేమా? రోజు జరుగుతున్న ఈ మరపురాని సంఘటనలు చూస్తూ ఉంటే ఒకే ప్రేమ, ఒకే బావోద్వేగం ఇలాగే చూపిస్తుండటం చూస్తుంటే మీ హద్దులు లేని ప్రేమకు థ్యాంక్స్‌ అని తెలుపుతూ మెసేజ్‌ చేసింది. దీంతో మహేష్‌ అభిమానులు ఎంతో ఖుషీ అవుతున్నారు. ఇక పవన్‌ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు. భవిష్యత్తులో చేస్తాడో లేదో కూడా తెలియదు. పవన్‌ ఉన్నంత కాలం పవన్‌, మహేష్‌ ల మధ్య నెంబర్‌ గేమ్‌కి విపరీతమైన పోటీ నెలకొంది. ప్రస్తుతం తాత్కాలికంగానైనా పవన్‌ సినిమాలకు బైచెప్పడంతో ఇప్పుడు టాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ ఎవరు అంటే ముక్తకంఠంతో మహేష్‌ పేరే చెబుతారు. ఇక 'భరత్‌ అనే నేను' కూడా శ్రీహరి నాను అనే రచయిత పవన్‌ జనసేన పెట్టినప్పుడు రాసుకున్నాడట. చివరకు అది మహేష్‌ వద్దకు చేరింది.....!

Namrata Shirodkar Thanks Mahesh’s Fans for Doing it Everyday:

Namrata Shirodkar is quite active on Instagram and keeps posting regular updates about her husband and his movies besides other things. <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs