సినీ నటుడు శివాజీ మొదట బిజెపి పార్టీలో ఉండి తర్వాత బయటకు వచ్చారు. ఈయన నేడు రాజకీయాలలోకి వస్తున్న పలువురు సినీ నటుల కంటే మెచ్యూర్డ్‌గా మాట్లాడుతున్నాడు, ముక్కుసూటి మనిషి. కానీ ఆయన బలహీనత ఆయన మాటలు ఎవ్వరూ పట్టించుకోకపోవడమే. కానీ ఆయన తాను అనుకున్నది మాత్రం ఎంతటివారినైనా సరే లెక్క చేయకుండా తన మనసులోని మాటలను ఘాటుగా చెబుతాడు. ఈయనలో పొలిటికల్ నాలెల్జ్ కూడా చాలా మంది కంటే ఎక్కువే ఉంది. ఇక ఈయన సమైక్యాంధ్ర ఉద్యమం, ఇప్పుడు ప్రత్యేక హోదా సాధన సమితిలో కొనసాగుతూ తన గళం వినిపిస్తున్నాడు. ఇండియా, మరీ ముఖ్యంగా ఏపీ దారిద్య్రం ఏమిటంటే వీరు కులానికి, క్రేజ్‌కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మిగిలిన మేధావులకు ఇవ్వరు. దాంతో చలసాని శ్రీనివాస్, జెపి, శివాజీ వంటి వారి వాయిస్‌ని మీడియా కూడా బలంగా చూపించలేకపోతోంది. ఇక తాజాగా శివాజీ కేంద్రంలోని జాతీయ పార్టీ ఆపరేషన్ ద్రవిడను ఆచరిస్తోందని, అందరు అది ఆపరేషన్ గరుడ అని భావిస్తున్నారని, కానీ ఆపరేషన్ ద్రవిడ దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ కవర్ చేసే విధంగా ఉందని ఆయన తెలిపాడు. ఇక తమిళనాడుకి 'ఆపరేషన్ రావణ', కర్ణాటకకు ఆపరేషన్ కుమార అని నామకరణం చేశారు. ఈ రాష్ట్రాలలో ఆపార్టీ అధికారంలోకి రావడం కోసం ఏకంగా 4,800కోట్లు ఖర్చుచేస్తోంది. మొదటగా సిబిఐ, ఇతర ఆర్దిక నేరాల పేరుతో అధికార పార్టీ నాయకుడిని ఒంటరిని చేసి, ఆయనను ఆర్ధికంగా దెబ్బతీస్తుంది.
మరో కొత్త నాయకుడిని తెరమీదకి తెచ్చి ఆల్‌రెడీ అధికారంలోకి రావాలని భావిస్తున్నమరో ముఖ్యమైన పార్టీకి ఇన్ డైరెక్ట్‌గా సహకారం అందించేలా చేస్తుంది. ఆకొత్త నాయకునికి కొందరు రాజకీయాల నుంచి వైదొలగిన వారు అండగా ఉంటారు. వారు చెప్పినట్లు అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఆయన చేత వ్యాఖ్యలు చేయిస్తారు. ఇక అధికారంలోకి ఆ ముఖ్యపార్టీ, కొత్త నాయకుడి సాయంతో వచ్చిన వెంటనే ఆ ముఖ్యపార్టీ నాయకుడిని ఆర్ధిక నేరాల రుజువులో భాగంగా జైలుకి పంపుతారు. ఇక కొత్త పార్టీ నాయకుడిని కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చి, జాతీయ స్థాయిలో ఉన్న తమ జాతీయ పార్టీకి చెందిన తెలుగు నేతను ముఖ్యమంత్రిని చేస్తారు. ఇందు కోసం రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తారు, ప్రాణహాని లేకుండా ప్రముఖ పార్టీ నాయకునిపై హత్యాయత్నం వంటివి చేస్తారు. ఇలా ఆ పార్టీకి రాష్ట్రంలో సానుభూతి లభించేలా ప్రవర్తించి, దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయాలనేది వారి వ్యూహం. దీనికి సంబంధించి ఓ జాతీయ పార్టీకి చెందిన అనుబంధ సంస్థ నాయకుడు, కర్ణాటకకి చెందిన కళ్యాణ్‌జీ అనే వ్యక్తి వీటన్నింటికి సహకరిస్తున్నాడని శివాజీ అన్నాడు. ఇది వినేందుకు సినిమా స్టోరీలా ఉన్నా, శివాజీ వ్యక్తులు, పార్టీల పేర్లు చెప్పకపోయినా ఇదే బిజెపి అసలైన ప్లాన్ అనేది గత కొంతకాలంగా తమిళనాడు నుంచి ఏపీ వరకు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమేనని తెలుస్తోంది.