ఎప్పుడూ యాక్షన్ సినిమాలకు పెద్ద పీట వేస్తూ కమర్షియల్ అండ్ మాస్ హీరోగా ఎదిగిన రామ్ చరణ్ మొదటిసారి 'రంగస్థలం' సినిమాలో మూస పాత్రకి ఓకె చెప్పాడు. తన రెగ్యులర్ చిత్రాలకు ఎంతో భిన్నమైన రంగస్థలం సబ్జెక్టుని ఎన్నుకుని చిట్టిబాబుగా అదరగొడుతున్నాడు. ఈ సినిమాలోని రామ్ చరణ్ చిట్టిబాబు లుక్ కి విశేషమైన స్పందన వచ్చింది. మరి ఎప్పుడూ స్టైలిష్ గా ఉండే చరణ్ ఇలా డి గ్లామర్ గా కనబడటంతో చరణ్ ఆలోచనల్లో ఎంత మార్పు వచ్చిందో తెలుస్తుంది. అలాగే తెరమీద వచ్చిన మార్పుతో పాటే.. చరణ్ లో ప్రస్తుతం నిజ జీవితంలో కూడా ఒక మార్పు వచ్చినట్టుగా తెలుస్తుంది. అదేమిటంటే ఇక నుండి తన దగ్గరికి వచ్చే దర్శక నిర్మాతలెవరైనా సరే పూర్తి స్క్రిప్ట్ తో వస్తేనే సినిమా చేస్తానని తెగేసి చెబుతున్నాడట.
మరి కేవలం ఒక లైన్ తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేసినా కావాల్సినప్పుడల్లా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చెయ్యడంతో ఎన్నో ఇబ్బందులతో పాటు టైం వేస్ట్ కూడా అవుతుంది అందుకే చరణ్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడట. అందులో సుకుమార్ తో ఒక ఏడాదిగా 'రంగస్థలం' సినిమాతో ట్రావెల్ చేసిన రామ్ చరణ్ ఈ షూటింగ్ లో చాలా విషయాలే నేర్చుకున్నాడట. ఎలా అంటే రంగస్థలానికి పూర్తి స్క్రిప్ట్ ఉన్నా కొన్నసార్లు రంగస్థలం షూటింగ్ స్పాట్ లో స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చెయ్యడంతో అనుకున్న సమయానికి రంగస్థలం షూటింగ్ కంప్లీట్ కాక... సినిమా విడుదల అనుకున్న టైంకి కాకపోవడంతో చాలా టైం వేస్ట్ అయ్యిందని.. అందుకే ఇక నుండి పూర్తి స్క్రిప్ట్ తోనే చరణ్ సెట్స్ మీదకెళ్లే కండిషన్స్ ని దర్శకనిర్మాతలకు పెడుతున్నాడట.
అలాగే ప్రస్తుతం రామ్ చరణ్, బోయపాటి సినిమా విషయంలోనూ ఇదే రకమైన పద్దతి ఫాలో అవుతున్నాడట. లేకుంటే ఎప్పుడో బోయపాటితో చరణ్ ఆ సినిమా సెట్స్ మీదకెళ్లేవాడట. అందులోను బోయపాటి మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశాడాయే. ఇప్పుడు కొత్తగా బోయపాటి స్క్రిప్ట్ ని పక్కాగా లాక్ చేసుకున్నాకే సెట్స్ మీదకెళదాం అంటున్నాడట. ప్రస్తుతం ఉన్న స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చెయ్యమని బోయపాటికి ఆల్రెడీ చెప్పేశాడట. అలా మార్పులు చేర్పులు అయ్యాక పూర్తి కథ తనకి వినిపించాకే సినిమా పట్టాలెక్కుతుందని మొహమాటం లేకుండా బోయపాటికి చరణ్ చెప్పాడని టాక్ మాములుగా ప్రచారం జరగడం లేదు. చూద్దాం చరణ్ ఈ డెసిషన్ తో మున్ముందు దర్శకనిర్మాతలు ఎలాంటి ఇబ్బందులు పడతారో అనేది.