పవన్ కళ్యాణ్ ఏదన్నా సినిమా చేస్తున్నాడు అంటే.. ఆ సినిమాకి ఆటోమాటిక్ గా క్రేజ్ వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ తోనే సినిమాకి బీభత్సమైన బిజినెస్ జరిగిపోయి నిర్మాతకు లాభాల పంట పండుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ తన సినిమాలకు ప్రమోషన్ చెయ్యకపోయినా ఆయన సినిమాలు ఆడేస్తాయనే నమ్మకమే నిర్మాతల్లో ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ ని ఆయన నిర్మాతలెవరు ప్రమోషన్స్ కోసం అడగరు. అడిగినా పవన్ కళ్యాణ్ వచ్చే టైప్ కాదు కూడా. అంటే పవన్ తన సినిమాల ఫంక్షన్ కి తాను రాడు. అంతేకాదు పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీ హీరోల ఈవెంట్స్ కి కూడా పెద్దగా హాజరవడు.
కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన ఫ్యాన్ కోసం కొద్దిగా తన పనులను పక్కన పెట్టి అతని ఫంక్షన్స్ కి మాత్రం వస్తాడు. మరి పవన్ కళ్యాణ్ ఆ అభిమాని ఎవరో కాదు మన టాలీవుడ్ యంగ్ హీరో నితిన్. నితిన్, పవన్ కళ్యాణ్ ని దేవుడి కన్నా ఎక్కువగా పూజిస్తాడు. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమిచ్చే టైప్ అన్నమాట. మరి పవన్ కళ్యాణ్ తన భక్తుడు కోసం ఒక మెట్టు దిగడానికి సిద్ధంగానే ఉంటాడు. అందుకే నితిన్ పిలవగానే నితిన్ సినిమాల ఈవెంట్స్ కి వచ్చి నితిన్ ని ఆశీర్వదిస్తాడు. మరి ప్రస్తుతం నితిన్ పవన్ క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ నిర్మాణంలో 'ఛల్ మోహన్ రంగ' సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా విడుదలకు దగ్గర పడడంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడందుకున్నాయి. అందులో భాగంగానే 'ఛల్ మోహన్ రంగ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు ఇది కన్ఫర్మ్. మరి రాజకీయాల్లో బిజీగా వున్నా పవన్ కళ్యాణ్ ఇలా తన సినిమాలను లైట్ తీసుకుని తన అభిమాని సినిమాలను ప్రమోట్ చెయ్యడం మరి చెప్పుకోదగ్గ విషయమే. మరి నితిన్ తన దేవుణ్ణి నమ్ముకున్నందుకు అతనికి వరుసగా విజయాలందుతున్నాయి కూడా. ఇక నితిన్ సరసన 'ఛల్ మోహన్ రంగ' సినిమాలో మేఘ ఆకాష్ నటిస్తోంది.