Advertisement
Google Ads BL

అఖిల్ 3కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్..!


అక్కినేని అఖిల్ హలో సినిమా తర్వాత ఎవరితో చేస్తాడు అని అందరు ఎదురు చూశారు. మొదట్లో కొరటాల శివ, సుకుమార్ పేర్లు వినిపించాయి. అయితే అఖిల్ మాత్రం 'తొలిప్రేమ' లాంటి సూపర్ హిట్ సినిమాను తీసిన వెంకీ అట్లూరికి ఛాన్స్ ఇచ్చాడు. వెంకీ చెప్పిన ప్రేమకథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అఖిల్. ఇప్పటికే కథ చర్చలు కూడా పూర్తయ్యాయి. అంతేనా ఉగాది రోజున సోషల్ మీడియా ద్వారా అఖిల్ అధికారికముగా వెంకీతో తన మూవీ అని ప్రకటించి అభిమానులను ఉత్సాహపరిచాడు కూడా.

Advertisement
CJ Advs

ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ కు సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇకపోతే వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'తొలిప్రేమ' సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ఇంకో కారణం మ్యూజిక్. తమన్ అందించిన పాటలు కూడా ఈ సినిమా హిట్ లో ప్రధానమైన పాత్రను పోషించాయి. చాలా రోజులనుండి హిట్ అందుకోవాలని తపన పడుతున్న థమన్ కి తొలిప్రేమ మ్యూజికల్ గా హిట్ అందించింది. అందుకే ఇప్పుడు అఖిల్ తన సినిమాలో కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ నే తీసుకోవాలనుకుంటున్నాడని పైన చూస్తున్న ఫొటోతో క్లారిటీ వచ్చేస్తుంది.

అఖిల్, థమన్, వెంకీ అట్లూరిలు అఖిల్ మూడో ప్రాజెక్ట్ మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నారని ఆ ఫోటోతో స్పష్టత వచ్చేసింది. ఇక అఖిల్ మూడో సినిమాని  'తొలిప్రేమ' సినిమాను నిర్మించిన బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో కథానాయికతో పాటు ఇతర విషయాల్లో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం వుంది. 

Music Director Confirmed for Akhil's next movie :

Thaman Composes Music For Akhil Third Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs