Advertisement
Google Ads BL

RRR - అనౌన్సుమెంట్ అదిరింది!!


భీభత్సమైన ప్రచారాం  జరుగుతున్నా ఎక్కడో ఏదో మూల ఒక చిన్న అనుమానం. మూడు నాలుగు నెలల క్రితం ఒక టాప్ దర్శకుడు స్టార్ హీరోలతో కలిసి ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దగ్గర నుండి ఒకటే హడావిడి. టాప్ డైరెక్టర్ రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ సినిమాపై బోలెడన్ని వార్తలు.... రోజుకో న్యూస్ సోషల్  మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయినా ఏదో ఒక డౌట్. కానీ ఇప్పుడు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ పై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఈ బిగ్ మల్టీస్టారర్ ని నిర్మించబోయే దానయ్య గారు తాజాగా  #RRR అంటూ రాజమౌళి.. రామ్ చరణ్.. ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా అంటూ అఫీషియల్ గా ప్రకటించేశాడు. 

Advertisement
CJ Advs

మరి #RRR అంటే రాజమౌళి, రామ్ చరణ్, రామారావు అని పూర్తి స్పష్టతతో... ఒక చిన్న వీడియోతో కలిపి అనౌన్సమెంట్ వచ్చేసింది. మరి ఇప్పటిదాకా గాసిప్స్ లో రాసిన న్యూస్ లన్నీ ఇప్పుడు ఈ అనౌన్సమెంట్ తో అధికారికం అయ్యాయి. డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఉన్నాయి. మరి అన్ని మల్టీస్టారర్ లకు ఉన్న రేంజ్ వేరు...ఈ మల్టీస్టారర్ కి ఉన్నరేంజ్ వేరు. ఈ సినిమాపై ఎక్కడలేని క్రేజ్ ఉంది. ఎందుకంటే టాలీవుడ్ లో టాప్ స్టార్స్ ఇద్దరు కలిసి నటించడం అంటే మాములు విషయం కాదు.

మరి ఈ అదృష్టం ఎవరిదంటారు. అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ కన్నా, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్నా ఎక్కువగా ఇలాంటి అరుదైన మల్టీస్టారర్ సినిమాని నిర్మిస్తున్న డీవీవీ దానయ్యది. రాజమౌళి గురించి వేరుగా చెప్పక్కర్లేదు. అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఎవరి క్రేజ్ వారికుంది. మరి గ్రాఫిక్స్ మాయాజాలం చెయ్యగల రాజమౌళి ఇప్పుడు కథా బలంతో... ఆప్యాయతలను, అనుబంధాలను మిళితం చేసి మరీ యాక్షన్ కి ఎక్కువ తక్కువ కాకుండా ఇద్దరు హీరోలకు సమానమైన పాత్రలను ఇస్తూ ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నాలు మొదలెట్టేశాడు. మరి #RRR మూవీలో ఎన్టీఆర్, చరణ్ లు ఎలా కనబడతారో గాని సినిమా పూర్తయ్యేవరకు ఇంకెన్ని రకాల న్యూస్ లు ఈ బడా మల్టీస్టారర్ పై వస్తాయో.

CLICK HERE FOR VIDEO

Rajamouli Announces, What Is RRR?:

Rajamouli Announces Multistarrer Working Title As RRR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs