Advertisement
Google Ads BL

చిరు పోస్ట్‌పెయిడ్‌..పవన్‌ ప్రీపెయిడ్‌!


ఎవరు అవునన్నా..కాదన్నా.. రాజకీయాలలో పవన్‌కి ఆయన అన్నయ్య చిరంజీవి పెద్ద అడ్డంకిగా మారాడు. అన్నయ్య చేసినట్లే తమ్ముడు కూడా చేస్తాడు అనే వాదన వచ్చిందంటే అది చిరు పుణ్యమేనని చెప్పాలి. పవన్‌ మీద నేడు చాలామందికి నమ్మకం లేకపోవడానికి ఇది కూడా ఓ కారణమనే చెప్పవచ్చు. మీ అన్నయ్య సంగతి ఏంటి? ఆయన్ను ఎప్పుడైనా ప్రశ్నించావా? నీకు అన్నయ్యపై అభిమానం ఉన్నట్లే చంద్రబాబుకి తన కొడుకు నారా లోకేష్‌ మీద అభిమానం ఉంటే తప్పేంటి? బిజెపి ఆడుతున్న నాటకంలో పవన్‌ అమ్ముడుపోయాడు. డిల్లీ వచ్చి, ఇంకా దేశం మొత్తం తిరిగి అవిశ్వాస తీర్మానానికి మద్దతు సంపాదిస్తానని చెప్పిన పపన్‌ ఇప్పుడు ఆ విషయం ఎందుకు మర్చిపోయాడు? ఇక ప్రత్యేకహోదా కోసం ఆమరణ దీక్ష చేస్తానని చెప్పిన పవన్‌ ఇప్పుడు ఆ ప్రస్తావనే ఎందుకు తేవడం లేదు? కేవలం ప్రజారాజ్యంని మోసం చేసిన వారి అంతుచూసేందుకే రాజకీయాలలోకి వచ్చాను వంటి వ్యాఖ్యలు పలువురు జీర్ణించకుకోలేకపోతున్నారు. ఇక ఆయన నియమించిన ఫ్యాక్ట్స్‌ ఫైండింగ్‌ కమిటి ఏమైంది? వంటి ప్రశ్నలు ఉదయించకమానవు.

Advertisement
CJ Advs

ఇక ప్రస్తుతం జనాలలో మాత్రం పవన్‌ బిజెపి కోవర్ట్‌గా వ్యవహరిస్తున్నాడనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. వీటికి సమాధానం ఇచ్చే స్థితిలో పవన్‌ లేకపోవడం దురదృష్టకరం, ఇక ప్రజారాజ్యం పార్టీలో చేరి తర్వాత టిడిపిలోకి వచ్చిన విజయవాడ ఎంపీ కేశినేని నాని పవన్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. ఆయన నాడు ప్రజారాజ్యం పార్టీని విడిచిపెట్టినప్పుడు కూడా ఆ పార్టీని దుమ్తెత్తిపోశారు. ఇక కేశినేని ట్రావెల్స్‌ మీద కూడా పవన్‌ పలుసార్లు విరుచుకుపడ్డాడు. దాంతో పవన్‌కి కౌంటర్‌ ఇవ్వడానికి ఇదే సమయమని భావించిన కేశినేని నాని మాట్లాడుతూ, చిరంజీవిది పోస్ట్‌పెయిడ్‌ పార్టీ, అయితే పవన్‌ది ప్రీపెయిడ్‌ పార్టీ అని విమర్శించాడు. ఇక విజయవాడ ఎంపీగా కేశినేని నానీ ఏ పని చేయడం లేదని, ఆయన తన పదవిని తన వ్యాపారాలకు అడ్డుపెట్టుకుంటున్నాడని పవన్‌ అభిమానులు విమర్శిస్తున్నారు. మరి కేశినేని విమర్శలకు పవన్‌ వద్ద ఏం సమాధానం ఉందో ఆయన నోరు విప్పితే కానీ తెలియదు.

Kesineni Nani Comments on Chiru and Pawan:

Chiranjeevi party Postpaid, Pawan Party PrePaid, Says TDP MP Nani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs