Advertisement
Google Ads BL

రానా.. కృష్ణవంశీని కాదన్నాడా..?


దగ్గుబాటి రానా ఈమధ్యన వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఘాజి, నేనే రాజు నేనే మంత్రి సినిమాల విజయాలతో బాగా బిజీ అయ్యాడు. అటు తమిళం ఇటు తెలుగులోనూ, ఇంకా బాలీవుడ్ లో కూడా రానా బాహుబలి సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. బాహుబలి భల్లాల దేవునిగా రానా ఒక రేంజ్ లో బాహుబలిలో దున్నేశాడు. ఇప్పుడిప్పుడే హీరోగా ఒక క్రేజ్ సంపాదించుకుంటున్న రానా.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీలలో పలు సినిమాలతో బిజీగా వున్నాడు. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో రానా ఒక చారిత్రాత్మక చిత్రాన్ని చేయనున్నాడనే ప్రచారం ఎలాగూ ఉంది. అయితే ఇప్పుడు రానా ఒక టాలీవుడ్ డైరెక్టర్ ని రిజెక్ట్ చేశాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

Advertisement
CJ Advs

అతనెవరో కాదు నక్షత్రం సినిమాతో అట్టర్ ప్లాప్ అందుకుని ప్రస్తుతం ప్లాపుల పరంపర కొనసాగిస్తున్న కృష్ణవంశీ చెప్పిన కథని రానా రిజెక్ట్ చేశాడంటున్నారు. తెలుగు, తమిళంలో క్రేజ్ ఉన్న రానాని దృష్టిలో ఉంచుకుని కృష్ణవంశీ ఒక స్టోరీ లైన్ ని రానాకి వినిపించగా ఆ లైన్ నచ్చిన రానా కృష్ణవంశీని పూర్తి కథ సిద్ధం చెయ్యమని చెప్పి పంపేశాడట. అయితే నక్షత్రం ప్లాప్ తర్వాత కృష్ణవంశీ ఈ కథని పూర్తి చేసి రానాని కలవగా పూర్తి కథవిన్న రానా ఈ కథపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదట. కథ అంత బాగాలేదనే అభిప్రాయం రానా వ్యక్తం చెయ్యడంతో నిరాశతో కృష్ణవంశీ అక్కడినుండి వచ్చేశాడనే టాక్ వినబడుతుంది.

మరి రానాకీ తగ్గట్టు ఆ కథలో మార్పులు చేర్పులు ఎమన్నా కృష్ణవంశీ  చేపడతాడో.. లేదా అదే కథతో మరో హీరోతో ఈ సినిమాని తెరకెక్కిస్తాడో అనేది తెలియాల్సి ఉంది. మరి టాలీవుడ్ లో ప్రస్తుతం కృష్ణవంశీని నమ్మి సినిమా అవకాశం ఇచ్చే హీరోలెవరు లేరు. చూద్దాం కృష్ణవంశీ కొత్త ప్రాజెక్ట్ ఏ హీరోతో ఎప్పుడు పట్టాలెక్కుతుందో అనేది.

Rana Rejects Star Director's Script?:

Rana Rejects Creative Director's Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs