Advertisement
Google Ads BL

రేష్మి, సుధీర్‌ ఇంత దిగజారుడా..?


సినిమాలలో ఆన్‌స్క్రీన్‌ మీద కెమిస్ట్రీ వర్కౌట్‌ అయినా,లేదా ఒకే జంట పలు చిత్రాలలో కలసి నటించినా కూడా వారిద్దరికి ఎఫైర్‌ ఉందనే వార్తలు రావడం సహజం. ఇప్పుడు ఈ ట్రెండ్‌ తెలుగు బుల్లితెరకి కూడా వచ్చింది. జబర్ధస్త్‌ షో యాంకర్‌ రేష్మిగౌతమ్‌కి సుడిగాలి సుధీర్‌కి మధ్య పలు స్కిట్స్‌ వారి మద్య ప్రేమ ఉన్నట్లుగా చూపించడం, ఇద్దరి మద్య సమ్‌థింగ్‌ అనేలా అనిపిస్తుంటాయి. దాంతో నిజజీవితంలో కూడా రేష్మి, సుధీర్‌లు ప్రేమలో ఉన్నారని, త్వరలో వివాహం కూడా చేసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ఇదంతా టీఆర్పీల కోసం, ప్రేక్షకులకు ఆనందం కలిగించేందుకే అన్నది సుస్పష్టం. 

Advertisement
CJ Advs

ఇక దీని ఆధారంగా ఉగాది నాడు రేష్మి-సుధీర్‌ల పెళ్లి చేశారు. సంగీత్‌ నుంచి వివాహం, ఫస్ట్‌నైట్‌ వరకు సన్నివేశాలు చూపించారు. ఈ విషయమై ఓ అభిమాని రేష్మితో మీరు సుధీర్‌ని వివాహం చేసుకున్నారా? లేదా? అని ప్రశ్నించాడు. దానికి రేష్మి సమాధానం ఇస్తూ, ఈ ప్రోగ్రాంని క్రమం తప్పకుండా చూడండి.. మీకే క్లారిటీ వస్తుందని గడుగ్గా సమాధానం ఇచ్చింది. ఇక ఇది టీవీ ప్రోగ్రాంలో స్పైస్‌ని మిక్స్‌ చేయడానికే అని రేష్మి చెప్పుకొచ్చింది. రేటింగ్‌ల కోసం ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ చేయడం, నిజజీవితం ఆధారంగా రేటింగ్‌ల కోసం ఆన్‌ స్క్రీన్‌పై తెగ హడావుడి చేసే ట్రెండ్‌కి రేష్మి, సుధీర్‌లతోపాటు టీవీ యాజమాన్యం, షో నిర్వాహకులు ఎంతగా దిగజారుతున్నారో దీనిని బట్టి తెలుస్తోంది. మరి రాబోయే కాలంలో ఈ ట్రెండ్‌ మరింతగా పాపులర్‌ అయి ఏస్థాయికి చేరుకుంటుందో మాత్రం ఊహించడానికే ఇబ్బందిగా ఉంది.

Anchor Rashmi Sudheer Marriage.. This Is The Matter:

Truth Behind Sudigali Sudheer and Rashmi Secret Marriage 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs