Advertisement
Google Ads BL

'కాలా' రిలీజ్ తికమక పెట్టేస్తోంది..!


నిన్నమొన్నటిదాకా రజినీకాంత్ నటించిన '2 .ఓ' మాత్రమే విడుదల తేదీ విషయంలో కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తూ అభిమానులను అల్లాడిస్తుంటే... ఇప్పుడు రజినీకాంత్ నటిస్తున్న మరో సినిమా 'కాలా' కూడా విడుదల డేట్స్ కన్ఫ్యూషన్ మొదలెట్టింది. అసలు గ్రాఫిక్స్ విషయంలో తలా తోకా లేకుండా '2 .ఓ' సినిమా విడుదలకు వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటుంటే.. ఇప్పుడు అదే సిట్యువేషన్ 'కాలా' కు కూడా వచ్చింది. '2 .ఓ'  సినిమాని లైకా ప్రొడక్షన్ వారు ఏప్రిల్ లో విడుదల చేస్తామని చెప్పగానే కాలా ప్రొడ్యూసర్ అయిన రజినీకాంత్ అల్లుడు గబగబా 'కాలా'  సినిమాని ఆగష్టు 15 న విడుదల తేదీ ప్రకటించాడు.

Advertisement
CJ Advs

అయితే 2 .ఓ సినిమా ఏప్రిల్ నుండి పోస్ట్ పోన్ అయ్యిందనగానే మళ్ళీ ధనుష్ కాలా సినిమాని ఏప్రిల్ 27 కి ప్రీ ఫోన్ చేశాడన్నారు. ఇక రజినీకాంత్ కూడా కాలా సినిమా ఏప్రిల్ 27 నే అన్నట్టుగా మాట్లాడాడు. ఇక తెలుగు సినిమాల బడా నిర్మాతలైతే ఆ ఏప్రిల్ 27  కోసం తన్నుకు చచ్చారు. రజిని కున్న క్రేజ్ ముందు తాము ఓడిపోతామనే భయం పట్టుకున్న ఆ నిర్మాతలు తమ సినిమాలను ఒకరు ఏప్రిల్ 27 కన్నా ముందుకి మరొకరు వెనక్కి జరిగిపోయారు. ఇక కాలా ఏప్రిల్ 27 కే ఫిక్స్ అనుకున్నారు అంతా. మరి ఇప్పటికే విడుదలైన కాలా టీజర్ రికార్డులు సృష్టిస్తుంది. ఇక సెన్సార్ అవడమే కాలాకు మిగిలిన పని.. మొత్తం పనులు కంప్లీట్ అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు.

కానీ తాజాగా కాలా డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు చూస్తున్న లైకా ప్రొడక్షన్స్ వారు కాలా విడుదల డేట్ గురించి సోషల్ మీడియాలో స్పందించారు. కాలా సినిమా ఏప్రిల్ లో విడుదలవుతున్నట్టుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి... కానీ మేము మాత్రం కాలా విడుదల తేదీ అధికారికంగా ప్రకటించలేదంటూ బాంబ్ పేల్చారు.  రిలీజ్ డేట్ విషయంలో గానీ .. ఈ సినిమాకి సంబంధించిన మరే అనధికారిక ప్రకటనలతో  గాని తమకి ఎలాంటి సంబంధం లేదని లైకా వారు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మరి లైకా వారు అలా అనగానే కాలా విడుదల ఏప్రిల్ 27 ఉంటుందా ఉండదా అనే డౌట్ ఇప్పుడు మళ్ళీ పిచ్చ కన్ఫ్యూషన్ ని క్రియేట్ చేస్తుంది.

Rajinikanth's 'Kaala' to be Postponed:

Confuse Continues 'Kaala' Release Date
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs