కన్నడ హిట్ మూవీ ‘యు టర్న్' సినిమా తెలుగు రీమేక్ లో సమంత మెయిన్ లీడ్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేశారు చిత్ర యూనిట్. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా రాజమండ్రి దగ్గరలో షూటింగ్ జరుపుకుంటోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం..ఈ సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఆమె మాజీ హీరోయిన్ భూమిక. నాని హీరోగా వచ్చిన ‘ఎం.సి.ఏ’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన భూమిక ఆ సినిమాలో నానికి వదినగా మెప్పించింది. అయితే తర్వాత భూమిక నాగ చైతన్య - చందూ మొండేటిల కాంబినేషన్ లో వస్తున్న ‘సవ్యసాచి’లో చైతన్యకు అక్కగా భూమిక కీరోల్ ప్లే చేస్తుంది. మరి మొదటగా భర్త నాగ చైతన్య సినిమా సవ్యసాచిలో నటిస్తున్న భూమిక ఇప్పుడు భార్య సమంత ‘యు టర్న్' సినిమాలో కూడా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ‘యు టర్న్' సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి రూపొందించనున్నారు.
మరి ఒకేసారి అటు భర్త, ఇటు భార్య సినిమాల్లో భూమిక నటిస్తుండడం మాత్రం విశేషమని చెప్పాలి. దీన్ని బట్టి ప్రస్తుతం ఇలా సెకండ్ ఇన్నింగ్ లో భూమిక తన కెరీర్ ని చక్కగా మలుచుకుంటుంది అని మాత్రం స్పష్టంగా అర్ధమవుతుంది.