ఇప్పుడు టాలీవుడ్ లో ఏ హీరోయిన్ పేరు ఎక్కువగా వినపడుతుంది అంటే పూజ హెగ్డే పేరే. ఒక్కసారిగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన ఈ భామ ఒక రేంజ్ లో క్రేజ్ కొట్టేసింది. మరి టాలీవుడ్ లో చేసిన రెండు సినిమాల తోనూ పెద్దగా క్రేజ్ కొట్టలేని ఈ భామ బాలీవుడ్ కి చెక్కేసింది. మరి అక్కడా అమ్మడుకి విజయం పలకరించలేదు. బాలీవుడ్ లో పూజ హెగ్డే నటించిన మోహింజదారో అట్టర్ ప్లాప్ అయ్యింది. అయినా ప్లాప్ హీరోయిన్ అని దడవకుండా హరీష్ శంకర్ - అల్లు అర్జున్ లు తమ దువ్వాడ జగన్నాధం సినిమాలో ఛాన్స్ ఇవ్వడంతో పూజకి లక్కు కలిసొచ్చింది. ఆ సినిమాలో అమ్మడు చేసిన గ్లామర్ షోతో పూజకి ఎదురులేకుండా పోయింది.
ఒక పక్క రామ్ చరణ్ తో రంగస్థలం వంటి బిగ్ ప్రాజెక్ట్ లో ఐటెం సాంగ్ చేసిన పూజ హెగ్డే....బెల్లంకొండతో సాక్ష్యం సినిమాలో టాప్ పారితోషకం అందుకుంటుంది. అంతేనా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన పూజ హెగ్డే వెంటనే మహేష్ కి జోడిగా వంశి పైడిపల్లి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అక్కడితో ఈ భామ అదృష్టం ఆగలేదు సుమీ. ఏకంగా బాహుబలి ప్రభాస్ పక్కన చోటు దక్కించుకుని టాప్ హీరోయిన్స్ అందరి గుండెల్లో దడ పుట్టించింది.
మరి ఎన్టీఆర్, మహేష్ ఒక ఎత్తు అయితే ప్రభాస్ సినిమా మరో ఎత్తు. ఎందుకంటే ప్రభాస్ కి బాహుబలితో ఇండియా అంతటా క్రేజ్ వచ్చేసింది. అలాంటి హీరో పక్కన పూజ నటించడం అంటే ఆమె అదృష్టం ఎలా ఉందో కదా. మరి ప్రభాస్ పక్కన నటించడం అంటే ఎలా ఫీల్ అవుతున్నారని పూజని అడిగితే.. ప్రభాస్ పక్కన ఛాన్స్ రావడం తన అదృష్టమని.. బాహుబలితో ఆయన క్రేజ్ అంతటా వ్యాపించింది... ప్రభాస్ కున్న క్రేజ్ అలాంటి ఇలాంటిది కాదు. ఆ విషయం తలచుకున్నప్పుడు నాకు టెంక్షన్ వచ్చేస్తుంది. అయినా అలాంటి విషయాలకు బెదరకుండా నా మీద దర్శకనిర్మాతలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా ఈ సినిమాతో నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాని.... చెబుతుంది పూజ హెగ్డే.