పేరులో ఏముంది అంటారు గానీ పేరుకు తగ్గట్లు మనుషుల ప్రవర్తన లేకపోతే నవ్వుల పాలవుతారు. తిండిలేని బీదరాలు అన్నపూర్ణ అని, కటిక దారిద్య్రం అనుభవిస్తున్న వారు కోటేశ్వరరావు, లక్ష్మీ, లక్ష్మీపతి అని పేరు పెట్టుకుంటే వినేందుకే ఇబ్బందిగా ఉంటుంది. ఇక ఈ ప్రస్తావన ఎందుకంటే మన రంగమ్మత్త గురించే. అనసూయ అంటే పతివ్రత, మాట తప్పని మనిషి పురాణాలలో కనిపిస్తుంది. ఇలాంటి పేరు పెట్టుకున్న రంగమ్మత్త మాత్రం తన శపధాన్ని తీసి పక్కన పెట్టేసింది. ఆమధ్య ఓ చిన్నబాలుడు సెల్ఫీ అడగటంతో వాడిని నానా దుర్భాషలాడి సెల్‌ఫోన్‌ని ఆమె నేలకేసి కొట్టింది. దీంతో ఆమెపై నెటిజన్లు పబ్లిక్‌లో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకోమని దాడి చేశారు. మొదట్లో తన తప్పు ఏమీ లేదని, ఆ పిల్లాడి తల్లే అబద్దాలు అడుతోందని చెప్పినా అనసూయని ఎరిగిన ఎవ్వరూ దానిని నమ్మలేదు. దాంతో ఘాటు విమర్శలకు సమాధానం ఇవ్వలేక ఆమె సోషల్‌మీడియా నుంచి నిష్క్రమించింది.
ఇక ఇటీవల సోషల్‌మీడియా మీద అలిగితే నీకే నష్టం గానీ ఎవ్వరికీ ఏమి నష్టం లేదని ఆమె సన్నిహితులు ఆమెకి హితబోధ చేశారు. దాంతో తాను నటిస్తున్న 'రంగస్థలం 1985' విడుదలైన తర్వాత మరలా సోషల్‌మీడియాలోకి ఎంట్రీ ఇస్తానని చెప్పి, ఇప్పుడు అంతకంటే ముందే మరలా రీఎంట్రీ ఇచ్చింది. 'రంగస్థలం 1985' టీజర్, అందులోని తన లుక్‌ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇక రంగమ్మ శపధం నిజంగానే ఉంటుందని భావించిన నెటిజన్లు ఇంత త్వరగా ఆమె మనసు మార్చుకోవడంతో విస్తుపోతున్నారు. అయినా అనసూయ మాటలను నమ్మితే ఎలా? అలా నమ్మడం మన తప్పే అని కొందరు అంటుంటే.. ఇక నుంచి జబర్దస్త్ షోలో తాను వేసుకునే కాస్ట్యూమ్స్ ఫొటోలు, 'రంగస్థలం'కి చెందిన అప్‌డేట్స్ ఈమె నుంచి ఇక రెగ్యులర్‌గా వస్తాయని ఓ వర్గం వారు ఆనందిస్తున్నారు. ఎంతైనా ఈమె సోషల్‌మీడియాలో మహా యాక్టివ్ కదా....! ఇక 'రంగస్థలం 1985'లో ఆమె లుక్ కూడా ఎంతో డీగ్లామరైజ్‌డ్‌గా, ఎవ్వరూ ఊహించని విధంగా సుకుమార్ తీర్చిదిద్దాడని తెలిసిపోతోంది. 'క్షణం' చిత్రం తర్వాత తనకు మరలా ఈ చిత్రం అంతటి పేరును తెచ్చిపెడుతోందని ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి ఇది నిజం అవుతుందో కాదో చూడాలంటే ఈ నెలాఖరు వరకు వెయిట్ చేయాల్సిందే.