Advertisement
Google Ads BL

ఈ చిత్రంతో కూడా కొట్టేట్టే ఉన్నాడు..!


ప్రస్తుతం కథాబలం ఉండి... మంచి కంటెంట్‌తో ఉండే వైవిధ్యభరిత చిత్రాలు బాగా విజయం సాధిస్తున్నాయి. దీంతో యంగ్‌ హీరోలందరూ ఇలాంటి వైవిధ్యభరితమైన చిత్రాలనే ఎంచుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే.. సినిమా విజయవంతం అయినా, కమర్షియల్‌గా హిట్‌ కాకపోయినా కూడా డిఫరెంట్‌ చిత్రం తీశామనే పేరు, విమర్శకుల ప్రశంసలు లభిస్తే ఆయా హీరోలకు, దర్శకులకు వెంటనే పలు అవకాశాలు లభిస్తున్నాయి. ఇక ప్రస్తుతం స్టార్స్‌ కూడా తమ ఇమేజ్‌, కమర్షియల్‌ హంగులు మిస్‌ కాకుండానే వైవిధ్యభరితమైన చిత్రాలవైపే నడుస్తున్నారు. కానీ ఇంకా ఈ వైఖరిలో స్టార్స్‌ మరింత మారాల్సి వుంది. త్వరలో విడుదల కానున్న 'రంగస్థలం 1985, 'భరత్‌ అనే నేను, నాపేరు సూర్య-నా ఇల్లు ఇండియా' నుంచి ఇటీవల వచ్చిన 'పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, అ, తొలిప్రేమ' ఇలాంటివన్నీ వీటికి పెద్ద ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇక నటునిగా శ్రీవిష్ణు రేంజ్‌ ఇంకా భారీగా పెరగకపోయినా కూడా ఆయన నటించిన 'అప్పట్లో ఒడుండే వాడు, ఉన్నది ఒకటే జిందగీ, మెంటల్‌ మదిలో' చిత్రాలు నటునిగా ఆయనని ప్రూవ్‌ చేశాయి. 

Advertisement
CJ Advs

ఈయన హీరోగా ప్రస్తుతం 'నీది నాది ఒకే కథ' అనే చిత్రం రూపొందింది. ఈ చిత్రం ట్రైలర్‌లోనే ఇందులో ప్రేమ, హాస్యం, ఎమోషన్స్‌తో పాటు ఆలోచింపజేసే అంశాలు, డైలాగ్స్‌ ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఈచిత్రం సెన్సార్‌ని కూడా పూర్తి చేసుకుంది. క్లీన్‌యూ సర్టిఫికేట్‌ని సాధించిన ఈ చిత్రం ఈనెల 23వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. అదే రోజు నందమూరి కళ్యాణ్‌రామ్‌ 'ఎమ్మెల్యే'గా రానున్నాడు. ఇక చదువుకున్న వాడే గొప్పవాడు. ఉద్యోగం సాధించిన వాడే ప్రయోజకుడు అనే విధానాలపై ఆత్మపరిశీలన చేసుకునే విధంగా ఈ చిత్రం ఉంటుందని శ్రీవిష్ణు అంటున్నాడు. పెద్దగా చదువు అబ్బని యువకుడి జీవితం ఎలా మలుపులు తిరిగింది? అనేది ఈ చిత్రం పాయింట్‌. ఇందులో నా పాత్రలో ప్రతి యువకుడు తనని తాను ఐడెంటిఫై చేసుకుంటాడు. ఇక నా తండ్రి పాత్రల్లో ప్రతి తండ్రి కనెక్ట్‌ అవుతాడు. అంత సహజంగా పాత్రలకు, కథను మలచడం జరిగింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ ఉన్న చిత్రాలే చేయాలనేది నా ఆలోచన. అందులో భాగంగానే ఈ చిత్రం చేశాను. ఈ చిత్రం ఖచ్చితంగా అందరికీ నచ్చి హిట్‌ అవుతుందని శ్రీవిష్ణు నమ్మకంగా చెబుతున్నాడు......! 

Needi Naadi Oke Katha Ready to Release :

Sree Vishnu Ready to One More Hit with Needi Naadi Oke Katha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs