Advertisement
Google Ads BL

ఎదిగే సమయంలో ఇదేం పని!


ప్రస్తుతం ఉన్న యంగ్‌ ప్రామిసింగ్‌ హీరోలలో నాగశౌర్య ఒకడు. ఆయనను అందరు లవర్‌బోయ్‌గా, డ్రీమ్‌బాయ్‌గా భావిస్తున్నారు. ఆయన కూడా తన చిత్రాల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాడు. ఇక ఈయన తాజాగా వెంకీ కుడుముల దర్శకత్వంలో కథ నచ్చి, నిర్మాతలు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో తానే నిర్మాతగా మారి 'ఛలో' చిత్రం చేశాడు. ఈ చిత్రం బాగా హిట్‌ అయింది. లోబడ్జెట్‌ మూవీ కావడం, సినిమా ఫ్రెష్‌గా ఉండటంతో ఈ చిత్రం మంచి లాభాలనే సాధించింది. ఇక నాగశౌర్య 'ఛలో' విడుదలకు ముందు కోనవెంకట్‌ క్రియేటివ్‌ హెడ్‌గా సాయిశ్రీరాం దర్శకత్వంలో ఓ చిత్రం ఒప్పుకున్నాడు. దీనికి నాగశౌర్య అగ్రిమెంట్‌ కూడా రాసుకున్నాడు. కానీ 'ఛలో'  చిత్రం విజయం తర్వాత ఆయన అంతకు ముందే ఒప్పుకుని సెటిల్‌ చేసిన రెమ్యూనరేషన్‌ని ఏకంగా పెంచేసి చెబుతున్నాడట. మరోవైపు ఈ చిత్రం స్టోరీ పెద్దగా బాగా లేదని దర్శకనిర్మాతలను బాగా ఇబ్బందిపెడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. 'ఛలో'  విడుదలకు ముందు నచ్చిన కథ ఇప్పుడు నచ్చకపోవడం ఏమిటి? నాడు ఓకే చేసిన రెమ్యూనరేషన్‌ని'ఛలో' విజయంతో పెంచడం ఏమిటి? అని క్రియేటివ్‌ హెడ్‌ అయిన కోనవెంకట్‌ ఈయన పట్ల చాలా అసంతృప్తితో ఉన్నాడని సమాచారం. 

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రానికి నాగశౌర్య సైన్‌ చేసిన మాట వాస్తవమేనని, కానీ నాడు వారు నాగశౌర్యకి కథను పూర్తిగా చెప్పలేదని నాగశౌర్య తండ్రి చెబుతున్నాడు. నాగశౌర్య ఇటీవల సాయిపల్లవిపై కూడా ఘాటు విమర్శలు చేశాడు. 'కణం' చిత్రం సందర్భంగా సాయిపల్లవి తన యూనిట్‌నే కాదు.. తనని కూడా ఎంతో ఇబ్బంది పెట్టిందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీనిని పెద్ద వివాదంగా మార్చకుండా సాయిపల్లవి ఎంతో సంయమనంతో వ్యవహరించింది. ఈమె నుంచి ఎలాంటి తప్పు జరగలేదని, ఈ చిత్ర దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌తో పాటు నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్‌ వారిచేత కూడా చెప్పించింది. మరీ ఇలా ఒక్క హిట్‌ వచ్చి రాగానే అతిగా బిహేవ్‌ చేయడం ఈ యంగ్‌హీరోకి భవిష్యత్తు రీత్యా మంచిది కాదు. ఈమధ్య మన కుర్రహీరోలు తరచుగా ఇలాంటి వార్తలతో సంచలనంగా మారుతున్నారు. ఆమధ్య సందీప్‌కిషన్‌ కూడా ఇలాగే బిహేవ్‌ చేశాడని, 'ప్రాజెక్ట్‌జడ్‌'కి సంబంధించిన తెలుగు వెర్షన్‌ని బషీద్‌ అనే నిర్మాతకు ఇచ్చి మరీ ఆ చిత్రాన్ని విడుదలకానివ్వకుండా అడ్డుపడ్డాడని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఎంతైనా మంచి భవిష్యత్తు ఉన్న ఈ హీరోలు సినిమా ఫీల్డ్‌లో ఎంత సహనంతో ఉండాలో నేర్చుకుంటే మంచిది...! 

Naga Shourya shocks Debutante:

Naga Shourya shocked the debutante Sai Sreeram by shelving the project
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs