Advertisement
Google Ads BL

'టెంపర్' రీమేక్ హీరోయిన్ ఈ భామే!


తెలుగులో ఎన్టీఆర్ - పూరి జగన్నాధ్ ల కాంబోలో వచ్చిన 'టెంపర్' తో ఎన్టీఆర్ మళ్ళీ ఫామ్ లో కొచ్చాడు. ఆ సినిమా హిట్ తో ఎన్టీఆర్ మళ్ళీ నిలదొక్కుకున్నాడు. కాజల్ - ఎన్టీఆర్ రొమాన్స్ తో పాటు ప్రకాష్ రాజ్ విలనిజం ఈ సినిమాకి హైలెట్. అయితే ఇక్కడ అంతటి విజయాన్ని సాధించిన ఈ సినిమాని రోహిత్ శెట్టి డైరెక్షన్ లో కరణ్ జోహార్ నిర్మాతగా రణ్వీర్ సింగ్ హీరోగా బాలీవుడ్ లో 'సింబా' పేరుతో రీమేక్ చేస్తున్నారు. అప్పుడే సినిమా సెట్స్ మీదకి కూడా వెళ్లి ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేసుకుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవ్వరిని తీసుకోలేదు.

Advertisement
CJ Advs

ముందుగా శ్రీదేవి కూతురు 'టెంపర్' రీమేక్ లో రణ్వీర్ పక్కన రొమాన్స్ చేస్తుంది అన్నారు. ఆతర్వాత సారా అలీ ఖాన్ అన్నారు. మళ్ళీ మొన్నటికి మొన్న మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ కి బాలీవుడ్ లో రణ్వీర్ పక్కన  'సింబా' లో అవకాశమొచ్చింది ఆ అమ్మాయి సుడి తిరిగింది అన్నారు. కానీ తాజాగా టెంపర్ రీమేక్ సింబా లో రణ్వీర్ కి జోడిగా సారా అలీ ఖాన్ నే ఫైనల్ చేసినట్లుగా కరణ జోహార్, రోహిత్ శెట్టిలు అధికారికంగా ప్రకటించడమే కాదు... సారా తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

మరి బాలీవుడ్ లో కేతరనాద్ సినిమాతో వెండితెర అరంగేట్రం చేస్తున్న ఈ కుర్రభామ సారా అలీఖాన్... ఇంకా ఆ సినిమా విడుదల కాకముందే కరణ్ నిర్మాతగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో నటించేస్తుంది. మరి కెరీర్ తొలినాళ్లలోనే రణ్వీర్ వంటి ఎనర్జిటిక్ హీరో పక్కన నటించడం సారా అలీ ఖాన్ కి కలిసొచ్చే అంశమే.

Sara ali Khan in Temper Bollywood Remake:

Heroine Confirmed For Temper Remake Simmba
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs