Advertisement
Google Ads BL

జనసేనానికి మరో నటి మద్దతు..!


పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కి, కత్తిమహేష్‌కి ఏర్పడిన తీవ్ర వివాదంలో పవన్‌కి సపోర్ట్‌గా మాట్లాడి అనుకోకుండా కత్తిమహేష్‌ టార్గెట్‌కి పూనమ్‌కౌర్‌ బలైంది. ఆమె చూపిన అత్యుత్సాహమే ఆమె కొంప ముంచిందని చెప్పవచ్చు. ఇక నాడు పవన్‌కి, పవన్‌ ఫ్యాన్స్‌కి మద్దతు తెలిపిన పూనమ్‌కౌర్‌ వాస్తవానికి ఎప్పుడో ఫేడవుట్‌ అయింది. కానీ ఈ వివాదం పుణ్యమా అని ఆమె మరలా వార్తల్లోకి వచ్చింది. అయితే కత్తిమహేష్‌ పూనమ్‌కౌర్‌ వ్యక్తిగత జీవితం, పవన్‌ గోత్రనామాలతో గుడిలో పూజ చేయించడం, పవన్‌ని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్దం అని గతంలోనే ప్రకటించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. చివరకి ఈ విషయం మా అసోసియేషన్‌ వరకు వెళ్లింది. అలాంటి పూనమ్‌కౌర్‌ తాజాగా పవన్‌ జరిపిన జనసేన ఆవిర్భావ సభ తర్వాత ఆయనను ఇన్‌డైరెక్ట్‌గా టార్గెట్‌ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కానీ ఆమె వాటిలో ఎక్కడా పవన్‌ పేరును మాత్రం ప్రస్తావించలేదు. ఇక తాజాగా మరోనటి జనసేనాని పవన్‌కళ్యాణ్‌కి తన మద్దతును ప్రకటించింది. రవిబాబు దర్శకత్వంలో ఉషాకిరణ్‌ మూవీస్‌ పతాకంపై వచ్చిన 'నచ్చావులే' హీరోయిన్‌ మాధవీలత పవన్‌కి తన సపోర్ట్‌ని తెలియజేసింది. 

Advertisement
CJ Advs

ఈమె మాట్లాడుతూ, పవన్‌ అంటే నాకు ప్రేమ అని గత పదేళ్లుగా ఇంటర్వ్యూలలో చెబుతూనే ఉన్నాను. అదే రీతిలో నాకు సమాజ సేవ అన్నా కూడా అంతే ఇష్టం. అందుకే 'నక్షత్ర ఫౌండేషన్‌'ని స్థాపించాను. కానీ సపోర్ట్‌ లేక ఫండ్స్‌ లేక సర్వీస్‌కు బ్రేక్‌ ఇచ్చాను. కానీ సేవ చేయాలన్న ఆశ మాత్రం చావలేదు. పవన్‌ అంటే నాకు అంత ఇష్టం ఉన్నప్పుడు ఒక వ్యక్తిగా ఆయన జనసేన పార్టీని స్థాపించినప్పుడు నేను ఎందుకు ఆయనకు సపోర్ట్‌ చేయకూడదు...? పవన్‌ కోసం దేనికైనా రెడీ అని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అయినా ఆమె పవన్‌కి మద్దతు తెలపడంలో తప్పేముంది? అంటోంది. అసలు అందులో తప్పు ఉందని ఎవరు అన్నారు గనుక. ఇక ఈమె ఆ మధ్య ట్రంప్‌ కూతురు ఇవాంకా హైదరాబాద్‌కి వచ్చిన సమయంలో ట్రాఫిక్‌ జామ్‌లు, సెక్యూరిటీని ఉద్దేశించి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. మొత్తానికి సినిమాల నుంచి ఫేడవుట్‌ అయిన పూనమ్‌కౌర్‌, మాధవీలత వంటి వారి మద్దతు వల్ల పవన్‌కి ఒనగూరే ప్రయోజనం అయితే ఏమీ లేదు. ఇంకా పవన్‌ పేరు చెప్పుకోవడం వల్ల వారికే మైలేజ్‌ వచ్చి వార్తల్లో నిలుస్తున్నారు. మొత్తానికి పవన్‌కి మద్దతుగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమెకి ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తాయో వేచిచూడాల్సివుంది....! 

Madhavi Latha Supports Pawan Kalyan's Janasena:

Madhavi Latha sensational Comments on Pawan kalyan  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs