Advertisement

పవన్‌కి క్లారిటీ లేదు సరే.. నీకుందా కత్తి..?


ఇటీవల కొంత కాలం, నిజం చెప్పాలంటే కొన్ని నెలలు పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌, కత్తి మహేష్‌ల గొడవ నానా రచ్చని క్రియేట్‌ చేసింది. ఇక నాడు కత్తిమహేష్‌ మాట్లాడుతూ, పవన్‌కి స్ధిరత్వం లేదని, ఆయన పార్టీపై, ఆయన రాజకీయాలపై ఆయనకే క్లారిటీ లేదని విమర్శించాడు. ఇక గత కొంత కాలంగా కత్తిమహేష్‌ కూడా రాజకీయాలలోకి వస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ గొడవ సమయంలో కూడా కత్తి మహేష్‌ వచ్చే ఎన్నికల్లో నేను కూడా పోటీ చేస్తా..అది కూడా పవన్‌ నిలబడిన నియోజకవర్గంలోనే పోటీ చేస్తానని తేల్చిచెప్పాడు. ఇక పవన్‌ మొదటి నుంచి తాను అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని చెబుతున్నాడు. ఆయన వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేయడం ఖాయం. ఇక పవన్‌కి స్ధిరత్వం లేదని చెప్పిన కత్తి మహేష్‌ తాజాగా తిరుపతిలో మాట్లాడుతూ, నేను రాజకీయాలలోకి వస్తున్నాను. చిత్తూరు జిల్లా నుంచే పోటీ చేస్తాను. అన్ని పార్టీలతో టచ్‌లో ఉన్నాను. ఏ పార్టీ తరపున, ఏ నియోజకవర్గం నుంచి అనేది ఇప్పుడే చెప్పలేమన్నాడు. 

Advertisement

ఇక కత్తిమహేష్‌ స్వస్థలం చిత్తూరు జిల్లా వాల్మీకి పురంలోని వాయల్పాడు కావడం విశేషం. మరి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతున్న ఈయన ఏ పార్టీ భావాలు నచ్చి ఏ పార్టీలో చేరుతాడు? ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు? అనే దానిపై ఇంకా క్లారిటీ లేకపోగా ఎవరు సీటు ఇస్తే ఏ నియోజకవర్గం నుంచి చాన్స్‌ ఇస్తే ఆ పార్టీలో చేరుతాననే విధంగా మాట్లాడటంతో పవన్‌కి కాదు.. కత్తిమహేష్‌కే ఈ విషయాలలో ఎలాంటి క్లారిటీ లేదని, కేవలం గోతికాడ నక్కలా కూర్చుని ఎవరు ఆహ్వానిస్తే ఆ పార్టీలోకి వెళ్లడం తప్ప ఆయనకంటూ సొంత అభిప్రాయలు, భావాలు, సిద్దాంతాలు లేవని, ఆయనకి ఏ పార్టీ సిద్దాంతాలు నచ్చాయో కూడా తెలియని సందిగ్ధంలో ఉన్నాడని అర్ధమవుతోంది. ప్రభుత్వాలను మాత్రమే విమర్శిస్తున్న పవన్‌ ఇప్పటికీ కార్యాచరణ మొదలుపెట్టలేదని కత్తి తాజాగా పవన్‌ని విమర్శించాడు. త్వరలో తన పార్టీకి సంబంధించిన కమిటీలను నియమిస్తానని పవన్‌ చెప్పిన విషయం కత్తికి తెలియదేమో? ఇక పవన్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడి నుంచి ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానని గొప్పలు చెప్పుకున్న కత్తికి ఏ విషయంలోనూ క్లారిటీ లేదని దీని ద్వారా నిరూపితం అవుతోంది....!

Kathi Mahesh To Contest in 2019 Polls From Chittoor:

Controversial Critic to Contest in 2019 General Election 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement