Advertisement
Google Ads BL

'ఎమ్మెల్యే'లో మ్యాటర్ ఇదే: కళ్యాణ్ రామ్!


నేను ఎక్కువగా కొత్త దర్శకులతో చేస్తున్నానని అంటారు. కానీ సబ్జెక్ట్‌ నచ్చితే కొత్త వ్యక్తా? అనుభవం ఉన్న డైరెక్టరా? అనేది నేను చూడను. ఇక నా బిగ్గెస్ట్‌ క్రిటిక్‌ నా ఫ్యామిలీనే. వర్క్‌ హార్డ్‌.... సక్సెస్‌ ఫాలోస్‌ అనే సిద్దాంతం నాది. ఇక నేను ఉపేంద్ర మాధవ్‌ని దర్శకునిగా చేస్తూ చేసిన 'ఎమ్మెల్యే' చిత్రం ఈనెల 23న విడుదల కానుంది. 'ఎమ్మెల్యే'గా పోటీ చేసిన రోజే రిజల్ట్‌ కూడా రావడం విశేషం. అంటే ఫలితం సినిమా విడుదలైన వెంటనే తెలిసిపోతోంది. ఇక నా చిత్రాలు ఎంత బడ్జెట్‌ పెట్టి అయినా తీస్తాను. కానీ బయటి బ్యానర్లలో చేసేటప్పుడు మాత్రం లిమిటెడ్‌ బడ్జెట్‌ని ప్రిఫర్‌ చేస్తాను. ఇందులో టైటిల్‌కి తగ్గట్లుగా పొలిటికల్‌ యాంగిల్‌ కూడా ఉంది. పొలిటికల్‌ డ్రామా అయినప్పటికీ లవ్‌ జర్నీతో మొదటి సగం సాగి, తర్వాత పాలిటిక్స్‌ వైపుకు వెళ్తుంది. ఇందులో నేను చేస్తున్న పాత్ర, అందులోని పొలిటికల్‌ డైలాగ్స్‌ పాత్రోచితంగా ఉంటాయే గానీ అవి నా భవిష్యత్తు పాలిటిక్స్‌కి సూచిక కావు. నాకు రాజకీయాలంటే ఆసక్తిలేదు. రాజకీయాలలోకి ఎప్పటికీ రాను. ఇక ఈ చిత్రంలో ఉపేంద్ర మాధవ్‌ రచయిత కూడా కావడంతో ఆయన రాసిన డైలాగ్స్‌ అద్భుతంగా వచ్చాయి. ఈ చిత్రంలో మేము కార్పొరేట్‌ విద్య గురించి కూడా చర్చించాం. ఈ సినిమాలో నా డైలాగ్‌ డిక్షన్‌ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ విషయంలో ఉపేంద్ర మాధవ్‌ ఎంతో శ్రద్ద తీసుకున్నాడు. కొన్నిసార్లు మనం కష్టపడినా, పరుగెత్తినా విజయం రాకపోవచ్చు. ఫలితం ఎలా ఉన్నా మనం చేసినది మనకి ఆత్మసంతృప్తిని కలిగించాలి. సాయిధరమ్‌తేజ్‌తో కలసి ఓ మల్టీస్టారర్‌ చేద్దామని భావించాం. 

Advertisement
CJ Advs

కానీ స్క్రిప్ట్‌ కుదరక ఆగిపోయింది. మంచి కథ వస్తే ఎవరితోనైనా నటించేందుకు నాకేం అభ్యంతరం లేదు. జులైలో ఓ మల్టీస్టారర్‌ స్టార్ట్‌ చేస్తాను. ఎవరితో అనేది త్వరలోనే తెలియజేస్తాను. ప్రొడ్యూసర్‌గా నేను ఇంత చెత్త సినిమా తీశాను? అని నాకు నేను, కళ్యాణ్ రామ్ ఇంత చెత్త సినిమా తీశాడు? అని ప్రేక్షకులు భావించే చిత్రాలు మాత్రం నేను చేయలేదు. తీయలేదు..... ఇక ఎన్టీఆర్‌తో మాట్లాడేటప్పుడు రాజకీయాలు అసలు ప్రస్తావనకు రాదు. కేవలం కార్లు, గాడ్జెట్స్‌ గురించే మాట్లాడుకుంటాం. ఈ చిత్రం ట్రైలర్‌ చూసిన తారక్‌ ఎంతో ఫ్రెష్‌గా ఉంది. ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నావు అని కాంప్లిమెంట్‌ ఇచ్చాడు. ఇక 'నా నువ్వే' అనే ఫుల్‌లెంగ్త్‌ లవ్‌స్టోరీ మొదటి సారిగా చేస్తున్నాను. ఇక కళ్యాణ్‌రామ్‌తో ఆనంది ఆర్ట్స్‌ పతాకంపై జెమిని కిరణ్‌ త్వరలో ఓ చిత్రం అనౌన్స్‌ చేశాడు. ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభం అవుతుంది... అని చెప్పుకొచ్చాడు. ఇక ఆయన నటించిన చిత్రాలలో ఎన్నో బోర్‌ చిత్రాలు, ఇక నిర్మాతగా కిక్‌2 వంటి డిజాస్టర్‌గా నిలిచి బోర్‌ కొట్టించే చిత్రాలు ఉన్నాయి. కానీ ఆయన నిర్మాతగా చెత్త సినిమాని ఇప్పటి వరకు తీయలేదని, ఇంత చెత్త సినిమా ఏమిటి? అని ప్రేక్షకులు ఫీల్‌కాలేదని చెప్పడం గమనార్హం.

Kalyan Ram MLA Interview :

Kalyan ram Ready for Multistarrer Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs