మధ్యనే సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో ఛలో సినిమా హిట్ కొట్టాడు నాగశౌర్య. ఇంతకుముందు మంచి సినిమాలు చేసినా ఛలో హిట్ తర్వాత నాగశౌర్య రేంజ్ బాగానే పెరిగింది. చిన్న బడ్జెట్ సినిమాగా చలో పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత నాగశౌర్య తన పారితోషకాన్ని పెంచేశాడనే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే అదలా ఉంటే ఒక్క ఛలో హిట్ తోనే నాగశౌర్య కి పొగరు కూడా పెరిగిందనే న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్త. ఛలో సినిమా సక్సెస్ తో ఈ కుర్ర హీరో కి కాస్త ఎక్కువైందని.. అంటున్నారు.
అదేమిటంటే నాగశౌర్య ఛలో సినిమా తర్వాత సాయిశ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. అసలు నాగశౌర్య... సాయిశ్రీరామ్ దర్శకత్వంలో ఛలో సినిమా కన్నా ముందే సినిమా చెయ్యడానికి సైన్ చేశాడు. అయితే ఇప్పుడు ఛలో సినిమా విడుదలై సక్సెస్ సాధించాక... ఇప్పుడు సాయిశ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా విషయంలో నాగశౌర్య తన పారితోషకాన్ని పెంచేయ్యడం... అలాగే ఇప్పుడు ఆ సినిమా స్క్రిప్ట్ విషయంలో అసంతృప్తిని చూపించడం వంటివి చేస్తున్నాడనే టాక్ వినబడుతుంది. ఆ విషయంలో ఆ సినిమాకి క్రియేటివ్ హెడ్ గా పనిచేస్తున్న కోన వెంకట్ ఫైర్ అవుతున్నాడట.
నాగశౌర్య ఆ సినిమా కథ విషయంలో వంకలు పెట్టడం వంటి విషయాల్లో కోన వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడట. ఛలో సినిమాకి ముందు చెప్పినప్పుడు నచ్చేసిన కథ ఇప్పుడు ఛలో విజయం సాధించాక నచ్చడం లేదంటే ఏం అనుకోవాలి... అసలు అప్పుడు నచ్చింది నాగశౌర్యకి ఇప్పుడెందుకు నచ్చలేదో అంటూ కాస్త సీరియస్ గానే ఉన్నట్లుగా చెబుతున్నారు. కాకపోతే ఈ విషయంలో నాగశౌర్య నాన్న వెర్షన్ మరోలా ఉంది. అదేమిటంటే ఛలో సినిమాకి ముందే నాగశౌర్య ఈ సినిమాకి సైన్ చేసిన విషయం నిజమే కానీ... అప్పుడు కథ పూర్తిగా చెప్పకుండా దాచేశారని చెబుతున్నాడు శౌర్య ఫాదర్. మరి ఇప్పుడు నాగశౌర్య - కోన ల మేటర్ ఫిలింనగర్ లో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతున్న హాట్ న్యూస్.