Advertisement
Google Ads BL

రంగమ్మత్త మాములుగా లేదు..!


ఇప్పటి వరకు జబర్దస్త్ స్టేజ్ మీద హాట్ హాట్ డ్రెస్సులేస్తూ... పెళ్ళైపోయి ఆంటీ అయిన హాట్ యాంకర్ కూడా అనసూయ అందమైన నడుం ఒంపులతో... మంచి బాడీని మెయింటింగ్ చేస్తూ కత్తిలా ఉండే అనసూయ వెండితెర మీద కూడా నాగార్జునకు మరదలిగా సోగ్గాడే చిన్నినాయనలో అదరగొట్టింది. అలాగే క్షణం సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నెగెటివ్  క్యారెక్టర్ లో ప్యాంట్ షర్ట్స్ వేసి దున్నేసింది. కానీ అమ్మడుకి వెండితెరమీద హీరోయిన్స్ రేంజ్ లో వెలిగిపోవాలని ఆశ మాత్రం పీక్స్ లో ఉండడంతో సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో అందరిని రెచ్చగొట్టినా అమ్మడుకి పని జరగలేదు.

Advertisement
CJ Advs

కానీ స్టార్ డైరెక్టర్ సుకుమార్ పిలిచి 'రంగస్థలం'లో అనసూయకు రామ్ చరణ్ కి అత్తగా నటించమని ఆఫర్ ఇస్తే ఒక్కసారిగా తెల్లబోయి నేను చరణ్ కి అత్త పాత్ర చెయ్యడం ఏమిటి అంటూ ఆశ్చర్యపోయిన అనసూయ తర్వాత సుకుమార్ మీద నమ్మకంతో రంగస్థలంలో రంగమ్మత్త పాత్రకి ఒప్పుకుంది. సినిమా మొదలైనప్పటి నుండి అనసూయ రంగస్థలంలో అత్త పాత్ర వేస్తుందని టాక్ బాగా వచ్చింది  కానీ నిన్న రాత్రి జరిగిన రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు పెద్దగా క్లారిటీ రాలేదు. ఇక ఈ ఈవెంట్ లో అనసూయ రంగమ్మత్త  క్యారెక్టర్ రంగస్థలంలో ఉన్నట్లుగా రివీల్ అయ్యింది. 

ఇప్పుడు తాజాగా రంగమ్మత్త అనసూయ పిక్ ఒకటి నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. పక్కా పల్లెటూరి స్టైల్ లో మోకాళ్ళదాకా ఎగగట్టిన చీరకట్టులో అనసూయ రంగమ్మత్తగా సరిగ్గా సరిపోయింది. మరి అనసూయ రంగమ్మత్త లుక్ లో విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే రామ్ చరణ్ చిట్టిబాబు లుక్, సమంత రామలక్ష్మి లుక్ లు విపరీతంగా ఆకట్టుకోగా.. ఇప్పుడు అనసూయ లుక్ కూడా అదరగొట్టేస్తుంది. మరి ఈనెల 30 న రంగస్థలం విడుదలయ్యేవరకు ఇలా పిక్స్ తో పోస్టర్స్ తోనే కాలక్షేపం చెయ్యాల్సిందే.

Pic Talk: Gutha Lanti Rathammaththa:

Anasuya Look As Rangammaththa From Rangasthalam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs