ఎప్పటినుండో ఎదురు చూస్తున్న దగ్గుబాటి - అక్కినేని ఫ్యామిలీ నుండి ఓ సినిమా రాబోతోంది. వెంకటేష్ - నాగ చైతన్య కాంబోలో ఓ మల్టీస్టార్రర్ కు రంగం సిద్ధం అవుతోంది. వెంకీ గతంలో ప్రేమమ్ సినిమాలో కాసేపు మెరిసి వెళ్ళిపోయాడు. అలాంటిది ఇద్దరు కలిసి ఓ ఫుల్ లెంగ్త్ సినిమాలో నటిస్తున్నారు అంటే ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు.
ఈ క్రేజీ మూవీని బాబీ డైరెక్ట్ చేయనున్నాడు. గత ఏడాది ఎన్టీఆర్ జై లవకుశతో బౌన్స్ బ్యాక్ అయ్యి ఫాంలోకి వచ్చిన బాబీ దాని తర్వాత ఇంత గ్యాప్ తీసుకుంది దీని స్క్రిప్ట్ కోసమేనట. ప్రస్తుతం వెంకీ.. చైతు వారి సినిమాల్లో బిజీగా ఉన్నపటికీ ఈ సినిమా కోసం కాల్ షీట్స్ సెట్ చేసుకుంటున్నట్టు తెలిసింది. వెంకీ తేజ డైరెక్షన్ లో ఆటా నాదే వేటా నాదే(వర్కింగ్ టైటిల్) షూటింగ్ లో వెంకీ బిజీగా ఉండగా చైతు చందూ మొండేటి డైరెక్షన్ లో 'సవ్యసాచి' సినిమాలో బిజీగా వున్నాడు.
'సవ్యసాచి' తర్వాత చైతు మారుతీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. తన భార్యతో శివ నిర్వాణ దర్శకత్వంలో కలిసి నటించే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చైతు. బహుశా ఈ సినిమాల తర్వాత వెంకీ - చైతు మల్టీస్టార్రర్ సినిమా వుండే అవకాశం ఉంది. మే లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీలో హీరోయిన్ ని సాంకేతిక వర్గాన్ని సెట్ చేసే పనిలో దర్శకుడు బాబీ బిజీగా ఉన్నట్టు టాక్.