మరో పది రోజుల్లో విడుదల కాబోయే రంగస్థలం సినిమా హడావిడి మాములుగా లేదు. పాటలను ఒక్కొక్కటిగా మర్కెట్ లోకి వదలడం, ఒక్కో టీజర్ ని అలా అలా వదలడం దగ్గరనుండి.. పాటలన్నిటిని కలిపి ఒకే రోజు మార్కెట్ లోకి విడుదల చెయ్యడం వంటివే కాదు... వైజాగ్ లో ఎంతో ఘనంగా అదిరిపోయే లెవల్లో రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించిన చిత్ర బృందం రంగస్థలం థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చెయ్యడం.. అబ్బో ఇలా చాలానే హడావిడీ చేస్తున్నారు. మరి పది రోజుల్లో సినిమా విడుదల అంటే ఈ మాత్రం హడావిడి అవసరమే. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ చిట్టిబాబుగా సమంత రామలక్ష్మిగా అదరగొట్టే పెరఫార్మెన్సు చూపిస్తుంటే రంగస్థలం ప్రెసిడెంట్ గా జగపతి బాబు... చిట్టిబాబు అన్నగా ఆది పినిశెట్టి కుమార్ బాబు పాత్రలు ఈ సినిమాలో బాగా హైలెట్ అయిన పాత్రలు.
అయితే ఈ నాలుగు పాత్రలతో పాటు మరో ముఖ్యమైన పాత్ర కూడా ఈ సినిమాలో ఉంది. అదే హాట్ యాంకర్ అనసూయ రంగమ్మత్త పాత్ర. మరి ఇంకా హీరోయిన్ పాత్రలే చేయాలనుకుంటున్న ఈ హాట్ అందాల భామ ఈ సినిమాలో రామ్ చరణ్ అలియాస్ చిట్టిబాబుకి అత్తగా రంగమ్మత్తగా అదరగొట్టేసింది. అయితే ముందు ఇలా అత్త పాత్ర చెయ్యనని చెప్పిన అనసూయ... రామ్ చరణ్ తేజ్ తన ఫేవరెట్ యాక్టర్ కాబట్టే ఈ అత్త పాత్ర ఒప్పుకున్నానని.. చరణ్ తో అత్తా అని పిలిపించుకోవడం.. నేను తనని అల్లుడు అంటూ పిలవడం అంటే నాకు నచ్చక ఆ అత్త పాత్ర నేను చెయ్యనుగాక చెయ్యనని డైరెక్టర్ సుకుమార్ దగ్గర మామూలుగా గోల పెట్టలేదు. అంత వద్దనుకున్న నేను ఈ సినిమాలో ఈ రోల్ చేశానంటే నాకున్న ధైర్యం సుకుమారే.. నేను ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ కు తల్లి పాత్రలో కనిపిస్తాననే సోషల్ మీడియాలో తెగ ఊహాగానాలొచ్చాయి. కానీ నా పాత్ర మాత్రం రంగస్థలం లో రంగమ్మత్త పాత్రే.
కానీ ఈ సినిమా చేస్తున్నప్పటికీ నేను రంగమ్మత్త పాత్ర చేయడమేమిటి... అని కాస్త ఫీల్ అయినా నా పాత్ర షూటింగ్ పూర్తయ్యి డబ్బింగ్ స్టేజ్ కి వచ్చేసరికి మాత్రం రంగమ్మత్త పాత్రని ఎంజాయ్ చెయ్యడం మొదలెట్టానని చెబుతుంది ఈ హాట్ యాంకర్ అనసూయ. మరి ఇద్దరు పిల్లలు పుట్టినా ఇంకా యంగ్ గా హీరోయిన్స్ కి పోటీనిచ్చే అనసూయ ఇలా అత్త పాత్ర చెయ్యడం మాత్రం సాహసమే అని చెప్పాలి సుమీ.