Advertisement
Google Ads BL

బాబాయ్ చేయమంటే చేస్తా..: కళ్యాణ్ రామ్!


బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కిస్తానని చెప్పినప్పటి నుండి ఇటు రాజకీయాల్లోనూ, అటు సినిమా ఇండస్ట్రీలోనూ చాలానే జరిగాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలకృష్ణే స్వయంగా తన తండ్రి పాత్రని పోషిస్తున్నాడు. అలాగే సాయి కొర్రపాటితో కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో బాలకృష్ణకి జోడిగా ఎన్టీఆర్ వైఫ్ బసవతారకం పాత్రని బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ పోషిస్తుందనే న్యూస్ ప్రచారం జరిగినప్పటికీ ఆమె ఈ సినిమాలో నటించడం లేదని తెలుస్తోంది. ఇకపోతే ఎన్టీఆర్ నట జీవితంలోను, రాజకీయ జీవితంలోను ఎంతోమంది కీలకమైన వ్యక్తులున్నారు. మరి ఎన్టీఆర్ పాత్రని బాలకృష్ణ పోషిస్తుంటే మిగిలిన పాత్రలను ఎవరు పోషిస్తారని అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది.

Advertisement
CJ Advs

అందులో ఎన్టీఆర్ కొడుకుల్లో ఒకరైన హరికృష్ణ పాత్రను ఎవరు పోషిస్తారో అనే ఆసక్తి మాత్రం అందరిలో కాస్త ఎక్కువే వుంది. మరి నటీనటుల ఎంపిక ఫైనల్ గా బాలకృష్ణ చేతిలో ఉంది. కాబట్టి హరికృష్ణ పాత్రకు బాలయ్య ఎవరిని ఓకే చేస్తాడో.... ఒకవేళ హరికృష్ణ పాత్రకు అయన కొడుకు కళ్యాణ్ రామ్‌ను తీసుకునే ఆలోచన ఎమన్నా బాలయ్యకు ఉందా... అనే చర్చలూ నడుస్తున్నాయి. అదే ఈ విషయాన్నీ ఎమ్యెల్యే ఇంటర్వ్యూలో భాగంగా కళ్యాణ్ రామ్‌ను ప్రశ్నిస్తే .. ఆ విషయం తనకేమీ తెలియదని అన్నాడు. అసలు తన తాత బయోపిక్‌కు సంబంధించి ఏ వివరాలూ తనకు తెలియవని.. ఒకవేళ బాలకృష్ణ బాబాయి తాత బయోపిక్ లో నటించమని అడిగితే ఏ పాత్ర అయినా తప్పకుండా చేస్తానని చెబుతున్నాడు కళ్యాణ్ రామ్.

మరి బాలకృష్ణ కళ్యాణ్ రామ్ ని పిలిచి ఎన్టీఆర్ బయోలో ఏదో ఒక పాత్ర ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే బాలకృష్ణకి కళ్యాణ్ రామ్ కి ఒకప్పుడు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ... ప్రస్తుతం మాత్రం లేవు. కారణం జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ తో నందమూరి ఫ్యామిలీలో ఒక్క హరికృష్ణ, కళ్యాణ్ రామ్ లు తప్ప మిగతా వారు కాస్త దూరంగానే ఉంటున్నారు. మరి కళ్యాణ్ రామ్ తన తమ్ముడు ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం వలన బాలయ్యకి కాస్త దూరమైన మాట వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ అటు కళ్యాణ్ రామ్ కి గాని ఎన్టీఆర్ కి గాని ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు అంటున్నారు.

Kalyan Ram About Balakrishna's NTR Biopic:

I don't know anything about NTR Biopic says Kalyan Ram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs