కమెడియన్, క్యారెక్టర్, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గానే కాదు.. హీరోగా కూడా 50కి పైగా చిత్రాలలో నటించాడు అలీ. ఈయన ఇండస్ట్రీకి వచ్చి 40ఏళ్లు అవుతోంది. 11 వందలకు పైగా చిత్రాలలో నటించాడు. ఇక ఈయన కామెడీలో ఈయన మాత్రమే బాగా మాట్లాడే 'ఎన్నా చాటా' అనే భాష నేటి 'బాహుబలి'లోని కిలికీ భాష కంటే పాపులర్ అయింది. 'మగాడు' చిత్రం షూటింగ్ కోసం కేరళ వెళ్లాం. హొటల్ పేరు గుర్తులేదు. ఎక్కడో సరిగా తెలియదు. దాంతో ఆటో వాడిని పిలిచి ఎక్కాం, ఆటో డ్రైవర్ ఎన్నా చేట. ఎన్న మార్కెట్ అంటూ ఏదేదో అడిగాడు. అది నాకు అర్ధం కావపోవడంతో ఆ.. అదే.. ఎన్న చేట అన్నాను. చివరకు హొటల్ చేరుకున్నాను. అక్కడ ఉన్న సందర్భంగా వారు మాట్లాడే భాష బాగా గమనించే వాడిని, ఇక నాకు చిన్ననాటి నుంచి మిమిక్రీ వచ్చు. 'షోలే' చిత్రంలోని గబ్బర్‌సింగ్ డైలాగ్‌లు ఎన్టీఆర్, ఏయన్నార్ చెబితే ఎలా ఉంటుందో చేసి చూపించేవాడిని. అలాగే మలయాళ భాష అర్ధం కాకపోయినా ఆ పదాలు గ్రహించి సినిమాలలో వాడాను. ఓ సారి ఈ భాష మామూలుగా తమాషాగా మాట్లాడుతుంటే రచయిత దివాకర్‌బాబు ఇదే బాగుంది.. ఇదే భాషని మాట్లాడు. నీకు వేరుగా డైలాగ్స్ పెట్టడం వేస్ట్ అని చెప్పాడు. అదే 'రాజేంద్రుడు-గజేంద్రుడు'లో మాట్లాడాను.
ఇక నాకు 1999లో మురళీమోహన్ టిడిపి సభ్యత్వం ఇప్పించారు. ఎన్నికల్లో ప్రచారం కూడా చేశాను. ఇప్పుడు సడన్‌గా రాజకీయాలలోకి వస్తానా? రానా? అనేది చెప్పను. అలా చెప్తే థ్రిల్ ఉండదు. పెసరట్లు వేడిగా ఉండి తింటేనే మజా వస్తుంది. ఇక పవన్‌కళ్యాణ్ విజయం నాదే.. పరాజయం నాదే అనుకునే మనస్తత్వం. ఆయన నామీద నమ్మకం ఉంటే రండి.. లేకపోతే వద్దు అని చెబుతారు. అంతే తప్ప బలవంతం చేయరు. ఇక పవన్‌తో నాకు గొడవలు వచ్చాయని వార్తలు వచ్చాయి. నిజానికి నాకు పవన్ సినిమాలలో రాకముందు నుంచే తెలుసు. చిరంజీవి కోసం వారింటికి వెళ్తుంటే పవన్ నేను మంచి స్నేహితులం అయ్యాం. ఆయన నటించిన మొదటి చిత్రం 'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి', తాజాగా వచ్చిన 'అజ్ఞాతవాసి'లో మాత్రం నటించలేదు. మిగిలిన చిత్రాలన్నింటిలో నటించాను తాజాగా తన పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి కూడా పిలిచారు. నేను కూడా వెళ్లాను. వెళ్తూ వెళ్తూ తెలుగు ఖురాన్ తీసుకుని వెళ్లాను. అనుకోకుండా మరొకరు అక్కడికి భగవద్గీత తీసుకుని వచ్చారు. ఇక నేను రంజాన్ సమయంలో ఐదు పూటలా నమాజ్ చేస్తాను. నెలరోజులు ఉపవాసం ఉంటాను. నా కుటుంబం కూడా అంతే. మా నాన్నగారు నాడు టైలర్‌గా పనిచేసేవారు అని చెప్పుకొచ్చాడు.