ప్రస్తుతం హార్వే, మలయాళ నటి భావన, తర్వాత ఎందరో నటీమణులు కాస్టింగ్‌కౌచ్‌పై గళమెత్తుతున్నారు. దీపికాపడుకోనే, రాధికా ఆప్టే, వరలక్ష్మి శరత్‌కుమార్, ఇలియానా నుంచి తాజాగా శ్రీరెడ్డి వంటి వారి వరకు ఈ విషయంలో తమ గొంతు వినిపిస్తున్నారు. ఇందులో అందరు చెప్పింది నిజమేనని నమ్మలేం. వేషాల కోసం తామే దర్శకనిర్మాతలను, హీరోలను లైంగిక ఆకర్షణకు గురయ్యేలా చేసేవారు ఎందరో ఉన్నారని, బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఏక్తాకపూర్ కూడా తెలిపింది. రాధికా ఆప్టే నుంచి శ్రీరెడ్డి అలియాస్ అలేఖ్య వంటి వారి మాటలు మాత్రం నాటకీయంగా వార్తల్లో ఉండేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా హాలీవుట్ ప్రముఖ నటి, గాయని జెన్నిఫర్ లోపేజ్ కూడా తన కెరీర్ స్టార్టింగ్‌లో తనకి కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని చెప్పి సంచలనం సృష్టించింది.
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, నటీమణులపై జరుగుతున్న లైంగిక వేధింపుల పట్ల 'మీటూ' ఉద్యమం ఊపందుకుంది.. తాజాగా జెన్నిఫర్ లోపేజ్ మాట్లాడుతూ, నేను కెరీర్ ప్రారంభంలో ఆడిషన్స్‌కి వెళ్లితే డైరెక్టర్ టాప్ తీసేసి నటించాలని కోరాడు. అలా చేస్తేనే సినిమా అవకాశం ఇస్తానని తేల్చి చెప్పాడు. అప్పుడే కెరీర్‌లో అడుగులు వేస్తున్న నాకు ఆ మాటలు విని భయం వేసి నా గుండెచప్పుడు నాకే వినిపించింది. భయంతో మైండ్ పని చేయలేదు.అయితే కొద్దిక్షణాల తర్వాత తేరుకుని అలా అయితే నాకు ఈ అవకాశం అవసరం లేదని చెప్పి వచ్చేశాను. నా బలాలు, బలహీనతలు నాకు తెలుసు. వేరే అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వస్తాయనే నమ్మకంతోనే నేను ఆ దర్శకుడికి నోచెప్పి ఎదిరించగలిగాను. ఆ తర్వాత దృఢసంకల్పంతో కష్టపడి, నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని ఈ స్థాయికి ఎదిగాను అని చెప్పింది. ఇందులో జెన్నిఫర్ లోపేజ్ చెప్పింది అక్షరసత్యం. ఈ పాత్ర, ఈ సినిమా కాకపోతే మరోటి వస్తుందని తమ టాలెంట్‌ని నమ్మి, ధైర్యంగా ముందుకు వెళ్లిన వారిని ఎవ్వరూఏమీ చేయలేరు. మనలోని బలహీనతల వల్లే షార్ట్‌కట్‌తో ముందుకు వెళ్లాలనే పద్దతిని నటీమణులు వదులుకోవాల్సివుంది....!