Advertisement
Google Ads BL

చిట్టిబాబు, లచ్చిమిల రోమాన్స్ ఉంటదీ..!


ఒకరు స్టార్ హీరోయిన్, మరొకరు స్టార్ అయినా కూడా ఇద్దరు కలిసి ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అప్పుడప్పుడు వారిద్దరూ కలిసి నటిస్తారని వార్తలొచ్చినా ఆ న్యూస్ ఆఖరుకి కేవలం ప్రచారాలుగానే నిలిచిపోయాయి. అయితే ఈ జంట ఇప్పటికి.... వెండితెర మీద కలిసి నటించింది. మరి ఈ పాటికే ఈ జంట ఎవరో అనేది తెలిసిందా. ఆ జంట ఎవరో కాదు రామ్ చరణ్, సమంతలే. వీరి కాంబోలో సినిమా ఉంటుందని రెండు ప్రాజెక్టుల విషయంలో వినిపించినా డేట్స్ సర్దుబాటు కాకో.. మరేదన్న కారణమో తేలియదు గాని ఎట్టకేలకు సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం'లో కలిశారు. మరి పల్లెటూరి ప్రేమ జంటగా రామ్ చరణ్, సమంతల రొమాన్స్ ఈ చిత్రానికి హైలెట్ కానుంది.

Advertisement
CJ Advs

కేవలం హైలెట్ మాత్రమే కాదు చరణ్, సమంతల కలయిక ఈ చిత్రంపై భారీ అంచనాలు పెంచింది. రామ లక్ష్మీగా సమంత చీర, లంగాఓణిలో హాట్ గా అందాలు ఆరబోస్తూ చరణ్ పక్కన అదరగొట్టేస్తుంది. ఇక రామలక్ష్మిని గాఢంగా ప్రేమించే ప్రేమికుడిగా చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ కూడా అదరగొట్టేస్తున్నాడు. రంగమ్మ మంగమ్మ పాటలో చిట్టిబాబు, రామలక్ష్మిల రొమాన్స్ తో పాటు ఇరగదీసే డాన్స్ స్టెప్పులు కూడా ఆకట్టుకునేలాగే కనబడుతున్నాయి. మరి 'రంగస్థలం' సినిమా పల్లెటూరి ప్రేమ కథగా వస్తున్న ఈ సినిమాకి రామలక్ష్మి, చిట్టిబాబుల  కెమిస్ట్రీని మెయిన్ హైలెట్ అవుతోందని అంటున్నారు.

మరి భారీ అంచనాల నడుమ 'రంగస్థలం' సినిమా మార్చ్ 30 న ప్రేక్షకులను పలకరించడానికి కూల్ గా థియేటర్స్ లోకి దిగిపోతోంది. ఈరోజు సాయంత్రం వైజాగ్ లో అదిరిపోయే పల్లెటూరి సెట్ లో రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ చిరు ముఖ్య అథితిగా మెగా అభిమానుల సమక్షంలో జరగనుంది.

Rangasthalam movie Latest Update:

Ram Charan and Samantha Romance Highlight in Rangasthalam    
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs