తెలుగులో సీనియర్ స్టార్స్‌తో పాటు శ్రీకాంత్, గోపీచంద్ వంటి యంగ్ స్టార్స్‌తో కూడా నటించిన హీరోయిన్ స్నేహ. జయసుధ, సుహాసిని, సౌందర్యల తర్వాత ఈమెకి హోమ్లీ హీరోయిన్‌గా ఎంతో పేరుంది. ఈమె భక్తిరస చిత్రాల నుంచి హీరోయిన్‌గా, బరువైన పాత్రలను పోషించే నటిగా తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు పొందింది. ఇక ఈమె బాపు చిత్రంలోకూడా నటించి బాపు బొమ్మగా పేరు తెచ్చుకుంది. ఈమె తమిళనటుడు ప్రసన్నని వివాహం చేసుకుంది. ఆ తర్వాత కూడా ఆమె నటనను కొనసాగిస్తూనే ఉంది. కానీ పెళ్లికాకముందులాగా ఈమె బిజీకాలేకపోయింది. దాంతో ఇప్పుడు ఆమె ఎలాగైనా తన రెండో ఇన్నింగ్స్‌ని కూడా విజయవంతం చేయాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయింది. భర్త ప్రసన్న ప్రోత్సాహంతో ఈమె ఇప్పుడు రెండు చిత్రాలలో నటిస్తోంది. అందులో ఒకటి కన్నడలో రూపొందుతోన్న 'ముని రత్న కురుక్షేత్ర'. ఇక ఈమెకి తెలుగులో కూడా అనుకోని విధంగా ఓ మంచి బంపర్ ఆఫర్ లభించింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఈమె కీలక పాత్రను పోషిస్తోంది. ఇక ఇందులో ఈమె రామ్‌చరణ్‌కి వదినగా, మాజీ తమిళహీరో ప్రశాంత్‌కి భార్యగా నటించనుందట.
బోయపాటి శ్రీను తన చిత్రాలలో యాక్షన్‌ని ఎంత హైవోల్టేజ్‌లో చూపిస్తాడో....సెంటిమెంట్ సీన్స్‌ని కూడా అదే స్థాయిలో తీసి మెప్పిస్తాడు. 'భద్ర, సింహా, లెజెండ్, జయజానకినాయకా' వంటి చిత్రాలన్నింటిలో మెలోడ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక నటీమణులంటే పెళ్లయిన తర్వాత ఫిజిక్ కోల్పోయి, కాస్త ఓవర్‌వెయిట్‌తోపాటు షేప్‌లు, గ్లామర్‌ని మిస్ అవుతుంటారు. స్నేహకి కూడా ఇదే సమస్య ఎదురైంది. దాంతో ఆమె జిమ్‌లో హార్డ్‌వర్క్ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు..నేను న్యూ జర్నీ స్టార్ట్ చేశాను. చేరుకోవాల్సిన గమ్యం చాలా దూరంగా ఉంది అంటూ తెలిపింది. ఇలా ఈమె వెయిట్ లిఫ్టింగ్ చేసిన వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మొత్తానికి కన్నడ సంగతేమోగానీ తెలుగులో బోయపాటి శ్రీను-రామ్‌చరణ్‌ల సినిమాలో ఈమె పాత్ర పండితే మాత్రం ఇక నుంచి సపోర్టింగ్ రోల్స్‌తో నేడున్న ఎందరో నటీమణులకు గట్టిపోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.