కళ్యాణ్ రామ్ - కాజల్ అగర్వాల్ జంటగా వస్తున్న ఎమ్యెల్యే సినిమా వచ్చే శుక్రవారమే విడుదలవుతుంది నందమూరి కళ్యాణ్ రామ్ పదేళ్లకు పటాస్ తో హిట్ అందుకుని ఇజం తో దెబ్బతిన్నాడు. ఈసారి 'ఎమ్యెల్యే' తో మళ్ళీ హిట్ కొట్టే కలలు బాగానే కనబడుతున్నాయి ఈ మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిలో. మరి కాజల్ అగర్వాల్ హాట్ అందాలు.. కళ్యాణ్ రామ్ ఫిట్నెస్ అతనిలోని కాన్ఫిడెన్స్ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ కావడమే కాదు... 'ఎమ్యెల్యే' కి మరో బంపర్ ఆఫర్ కూడా తగిలింది. అదేమిటంటే ఈ వారం విడుదలైన కిరాక్ పార్టీకి యావరేజ్ టాక్ రాగా... నయనతార 'కర్తవ్యం' సినిమా కి క్రిటిక్స్ బెస్ట్ మార్కులు వేసిన ప్రేక్షకులు మాత్రం ఆ సినిమాని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో తమిళ నేటివిటీతోపాటు.. ఒక్క నయనతార మాత్రమే తెలుగు ప్రేక్షకులకు తెలిసిన యాక్టర్ కావడం ఆ సినిమాకి మెయిన్ మైనస్.
అందుకే ఈ రెండు సినిమాలు సో సో కలెక్షన్స్ తో ఉన్నాయి కాబట్టి 'ఎమ్యెల్యే' కి వచ్చే శుక్రవారం మంచి ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. మరి ఎమ్యెల్యే తోపాటు విడుదల కాబోతున్న శ్రీ విష్ణు 'నీది నాది ఒకే కథ' ఎలా వున్నా కూడా ఆ సినిమాకి పెద్దగా ఓపెనింగ్స్ రావు. ఎందుకంటే శ్రీ విష్ణుకి అంత మార్కెట్ లేదు., మిగిలిన 'రాజరధం' సినిమాకు పెద్దగా సీన్ లేకపోవడం కూడా ఎమ్యెల్యేకి కలిసొచ్చే అంశం. మరి ట్రైలర్ లో చూపించినట్టుగా ఎమ్యెల్యే అదే ఊపు కథ మొత్తం ఉంటే సినిమాకి మంచి టాక్ వచ్చి నిలబడగలుగుతుంది. ఒకవేళ టాక్ యావరేజ్ వచ్చిన ఎమ్యెల్యే గట్టెక్కేస్తుంది. మరి ఈ సినిమాలో మెయిన్ గా కాజల్ అందాలు అందరిని కనువిందు చెయ్యనున్నాయి అనేది మాత్రం ట్రైలర్ లోనే తెలుస్తుంది.
టాప్ హీరోలతో కాజల్ ఎంతగా గ్లామర్ షో చేస్తుందో కళ్యాణ్ రామ్ తో కాజల్ అలానే అందాల ఆరబోతకు దిగడంతో పాటుగా ఈసారి కళ్యాణ్ రామ్ ఎమ్యెల్యే ట్రైలర్ చూస్తుంటే పటాస్ తరహాలో మరోసారి తన బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే కథనే ఎంచుకోవడం కూడా ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్. ఇక ఆ తర్వాతి వారం రామ్ చరణ్ 'రంగస్థలం'తో పోటీకి సై అంటున్నాడు ఎమ్యెల్యే.