Advertisement
Google Ads BL

ఇలియానా వస్తానంటోంది.. కానీ?


'దేవదాసు'తో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు ముందుగా సైజ్‌జీరో అందాలను పరిచయం చేసిన భామగా ఇలియానాని చెప్పుకోవచ్చు. ఈమె తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా అందరు యంగ్‌స్టార్స్‌ సరసన నటించింది. స్టార్‌, బిగ్‌ డైరెక్టర్స్‌ చిత్రాలలో చేసింది. ఈతరంలో మొదట కోటి రూపాయలకు పైగా పారితోషికం తీసుకున్న హీరోయిన్‌గా రికార్డులకు ఎక్కింది. అలా ఆరేడేళ్లు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపిన తర్వాత ఈమె బాలీవుడ్‌కి వెళ్లి స్థిరపడింది. ఇక తెలుగులో చివరిగా నటించిన చిత్రం అల్లుఅర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వచ్చిన 'జులాయి'. ఆ తర్వాత కూడా ఆమెని పలువురు స్టార్స్‌ సరసన నటించమని మన ఫిల్మ్‌మేకర్స్‌ అడిగినా కూడా ఖచ్చితంగా నో చెప్పింది. అంతేకాదు.. దక్షిణాదిన మరీ తెలుగులో అందరు తనను అందాల వస్తువుగా చూశారని, నాటాలెంట్‌కి తగ్గ పాత్రలు ఇవ్వలేదని మన చిత్రాలను కించపరుస్తూ మాట్లాడింది. అలాగని ఆమె ఏమైనా బాలీవుడ్‌లో అద్బుత చిత్రాలు చేసిందా అంటే అదీ లేదు. అక్కడ హిట్‌ చిత్రాలు చేసిన నటిగా మాత్రం ఇలియానాకి పేరు రాలేదు. ఇక తాజాగా ఆమె అజయ్‌దేవగణ్‌తో నటించిన 'రైడ్‌' చిత్రం విడుదలైంది. 1980ల కాలం నాటి కథను తీసుకుని, దానికి నేటి సంఘటనలను గూర్చి, ఇన్ కం ట్యాక్స్‌ రైడ్‌ అనే ఫార్ములాతో ఈ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రానికి రివ్యూ రేటింగ్‌లు బాగానే వస్తున్న ప్రేక్షకులు మాత్రం డిజప్పాయింట్‌ అవుతున్నారు.

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రం చూస్తే అవినీతి మీద అవగాహన వస్తుందని, మార్పు మననుంచే ప్రారంభం కావాలనే నీతి ఇందులో ఉందని అంటున్నారు. ఇక ఈ చిత్రం ఎలా ఉన్నా కూడా హీరోయిన్‌గా నటించిన ఇలియానా పాత్ర మాత్రం ఇందులో తీసికట్టుగా ఉంది. కేవలం హీరోతో పాటలు, రొమాన్స్‌, రాసుకు పూసుకు తిరగడం మినహా తెలుగులో వచ్చే పక్కా యాక్షన్‌ చిత్రాలలోని హీరోయిన్ల కంటే ఇలియానా క్యారెక్టర్‌ ఇందులో తేలిపోయింది. మరి దక్షిణాదిని తప్పుపట్టిన ఈ భామ ఇప్పుడేం చేస్తోంది? అని అందరు వెయిట్‌ చేస్తున్నారు. ఇక ఈమెని సౌత్‌కి మరలా వస్తారా? అని ప్రశ్నిస్తే నాకు రావాలనే ఉంది. నేను తెలుగులో స్టార్‌ హీరోలు, స్టార్‌ దర్శకులతో బిగ్‌ ప్రాజెక్ట్స్‌ చేశాను. ఆ స్థాయి సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నాను. త్వరలో అలాంటి అవకాశం వస్తుందని భావిస్తున్నారు. తెలుగు పరిశ్రమ నన్ను నటిగానే కాదు.. బలవంతురాలైన మహిళను కూడా చేసింది. నటిగా ఎదుగుతూనే మనిషిగా కూడా ఎదిగాను. నా ఆలోచనా పరిధిని దక్షిణాది పరిశ్రమ మార్చింది. జీవితం అంటే ఏమిటో తెలిపింది. ఇక్కడ వచ్చిన పాపులారీటి వల్లనే నాకు బాలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చింది. ఇంత చేసినా నేను సౌత్‌ఇండస్ట్రీకి దూరమవ్వాలని కోరుకోవడం లేదు. మళ్లీ సౌత్‌కి రావాలని ఉందని తెలిపింది. మొత్తానికి ఇక బాలీవుడ్‌లో లాభం లేదని ఈమె తెలుగు మేకర్స్‌కి ఇలాంటి సందేశాన్నీ పంపుతోందని అంటున్నారు....! 

Ileana Ready to Re Entry in Tollywood:

Ileana About Tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs