సౌతిండియన్ సూపర్‌స్టార్‌గా రజనీకాంత్‌కి దేశ విదేశాలలో, బాలీవుడ్ నుంచి మలేషియా, సింగపూర్, జపాన్.. ఇలా అనేక దేశాలలో కూడా వీరాభిమానులు ఉన్నారు. మరోవైపు మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్‌గా పేరొందిన అమీర్‌ఖాన్ ఇటీవల వరుస సంచలనాలు నమోదు చేస్తున్నాడు. ఒకప్పుడు బాలీవుడ్ టాప్ స్టార్ అంటే ముగ్గురు ఖాన్‌లలో అందరు షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్‌ల పేరే చెప్పేవారు. ఎక్కువగా కమర్షియల్, మాస్, యాక్షన్ చిత్రాలను షారుఖ్, సల్మాన్‌లు చేస్తుండటం మరోవైపు అమీర్ ఎక్కువగా ప్రయోగాత్మక, వైవిధ్యభరితమైన చిత్రాలు చేసేవాడు కావడంతో నటునిగా అమీర్‌కే ఎక్కువ పేరు ఉన్నా ఫాలోయింగ్, క్రేజ్, కలెక్షన్స్ వంటివి షారుఖ్, సల్మాన్‌లకు ఉన్నట్లుగా అమీర్‌కి ఉండేవి కావు. కానీ 'లగాన్' నుంచి 'దంగల్', సీక్రెట్ సూపర్‌స్టార్ వరకు అమీర్ అద్భుతంగా దూసుకెళ్తూ మిగిలిన ఇద్దరినీతోసి ముందుకొచ్చాడు.
ఇక ఈయన చిత్రాలు విదేశాలలో, మరీ ముఖ్యంగా చైనాలో అదరగొడుతున్నాయి. కాగా ప్రస్తుతం ఆయన అమితాబ్‌బచ్చన్‌తో కలిసి 'థగ్స్‌ఆఫ్ హిందుస్థాన్' చిత్రం చేస్తున్నాడు. విజయకృష్ణ ఆచార్య దర్శకత్వంలో కత్రినాకైఫ్, ఫాతిమా సనా షేక్‌లు కూడా నటిస్తున్నారు. స్వాతంత్య్రం రాకపూర్వం దోపిడీ దొంగల నేపఫధ్యంలో ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా రానుంది. ఇక ఈ సినిమాని దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. ఆరోజు తన భార్య పుట్టినరోజు కావడంతో అదే రోజున 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' విడుదవుతుందని అమీర్ స్పష్టం చేశాడు. మరోవైపు దేశంలోనే అత్యధిక బడ్జెట్‌తో రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌లు నటిస్తున్న శంకర్ చిత్రం '2.0' కూడా దీపావళికి గానీ విడుదయ్యే అవకాశం లేదని స్పష్టమవుతోంది. అమీర్ తమ చిత్రం '2.0'తో సహా ఏ చిత్రం పోటీకి రాదనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. రజనీ, శంకర్‌లకు అమీర్ సన్నిహితుడు కావడంతో '2.0' చిత్రం విడుదల విషయంలో అమీర్‌కి స్పష్టమైన సమాచారం లభించే ఉంటుందని, అందుకే ఆయన అంత ధీమాగా ఈ విషయం చెప్పాడని అంటున్నారు.
అమీర్ మాట్లాడుతూ, దేశంలో 5 వేల థియేటర్లు ఉన్నాయి. ఏదైనా పెద్ద చిత్రం విడుదల నేపధ్యంలో ఎక్కువ థియేటర్లలో చిత్రాన్ని వేస్తారు. రజనీ సార్‌తో పోటీపడితే మాకే నష్టం. రజనీసార్‌ని నేనెంతో గౌరవిస్తాను. కాబట్టి ఈ రెండు చిత్రాలు ఒకేరోజున గానీ లేదా తక్కువ గ్యాప్‌లో గానీ విడుదలయ్యే అవకాశం లేదని అమీర్ స్పష్టం చేశాడు.