Advertisement
Google Ads BL

మహేష్ హీరోయిన్ చెల్లి అదిరిందిగా!


మహేష్ బాబు - సుకుమార్ కాంబోలో గతంలో వచ్చిన 1 నేనొక్కడినే సినిమాతోనే బాలీవుడ్ భామ కృతి సనన్ తెలుగు తెరకి పరిచయం అయ్యింది. అయితే మొదటి తెలుగు సినిమా కృతి సనన్ కి పెద్దగా విజయాన్ని అందించలేదు. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా కృతిని టాలీవుడ్లో టాప్ రేంజ్ కి చేర్చలేకపోయాయి. ఇక టాలీవుడ్ లో నెగ్గలేక బాలీవుడ్ కి తిరిగెళ్ళిపోయి అక్కడే సినిమాలు చేసుకుంటూ సెటిల్ అయ్యింది. కృతి సనన్ కథల విషయంలో పర్ఫెక్ట్ గా లేకపోవడం వలెనే ఆమెకు తరుచు పరాజయాలు ఎదురయ్యాయని ప్రేక్షకులు బహిరంగంగానే చెప్పుకునేవారు. సినిమాల విషయంలో ఎలా వున్నా హాట్ ఫోటో షూట్స్ తో అమ్మడు ఎప్పుడు సోషల్ మీడియాలోనే చక్కర్లు కొడుతోంది.

Advertisement
CJ Advs

ఇకపోతే ప్రస్తుతం కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్ కూడా మోడలింగ్ నుండి వెండితెరవైపు అడుగులు వేస్తోంది. గత కొన్నాళ్లగా మోడలింగ్ రంగంలో ఉన్న నుపూర్ సనన్ అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందుకే ఇక వెండితెరకు పరిచయమవ్వాలని అమ్మడు జాగ్రత్తగా స్టెప్పులు వేస్తోంది. ప్రస్తుతం మోడలింగ్ రంగంలో రాణిస్తూ క్యూటీ లుక్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో టచ్ లోనే ఉన్న ఈ నుపూర్ సనన్ కి ఎవరైనా పిలిచి అవకాశం ఇస్తే మాత్రం చక్కగా సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటోంది. మరి ట్రెడిషనల్ లుక్ తోనే నుపూర్ సనన్ సినిమాల్లో రాణించాలని అనుకుంటుందట. అందుకే గ్లామర్ సైడ్ తీసుకోకుండా ట్రెడిషినల్ లుక్ లోనే ఎక్కువగా హల్చల్ చేస్తోంది.

మరి కృతి సనన్ మీద నుపూర్ సనన్ లుక్స్ పరంగా బాగుందనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఇక గ్లామర్ డోస్ లేకుండా పద్ధతైన లుక్స్ లోనే నుపూర్ సనన్ సినిమాల్లో ఎలా నటించాలో లాంటి సలహాలను నుపూర్ సనన్ తన అక్క దగ్గర నుండి తీసుకుంటుందట. అయితే ప్రస్తుతం నుపూర్ సనన్ కి ఆఫర్స్ వస్తున్నా చాలా ఆచి తూచి కథ నచ్చాకే.... ఆ పాత్ర తనకి సెట్ అయ్యేలాగా ఉండే సినిమాలనే ఒప్పుకోవాలని డిసైడ్ అయ్యిందట. చూద్దాం అక్కలాగా కాకుండా నుపూర్ సనన్ ఏమైనా టాప్ పొజిషన్ కి చేరుతుందేమో.

kriti sanon Ready to cine Entry:

Kriti Sanon Sister Nupur Photoshoot hulchal in social media  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs