Advertisement
Google Ads BL

పూజాహెగ్డే హవా నడుస్తుంది!


ఇప్పుడు ఎక్కడ విన్నా.. ఏ స్టార్ హీరో పక్కన చూసినా నటి  పూజాహెగ్డే పేరు మాత్రమే వినిపిస్తుంది. ఒకే ఒక్క సినిమా  పూజాహెగ్డే కెరీర్ నే మార్చేసింది. డీజే సినిమాలో అమ్మడు వేసిన స్విమ్ సూట్ తో ఆమె  ఒక్కసారిగా అదృష్టవంతురాలిగా మారిపోయింది. ఏదో బెల్లంకొండ సినిమాలో భారీ పారితోషకాన్ని తీసుకొని హీరోయిన్ గా నటిస్తుంది అనుకున్నంతలో పూజ కి బడా హీరోల పక్కన నటించే అవకాశం ఒకదాని మీద ఒకటి వచ్చేసింది. ఒకప్పుడు ఇలియానా, సమంత, రకుల్ ప్రీత్ లు ఎలా అతి కొద్దీ టైం లో టాప్ హీరోయిన్స్ అయ్యారో సేమ్ అలాగే ఉంది ప్రస్తుతం పూజాహెగ్డే పరిస్థితి. ప్రస్తుతం పూజ చేతిలో ఉన్న అవకాశాలు చూస్తుంటే చాలా తొందరలోనే పూజా టాప్ చైర్ ఎక్కిస్తోంది అనిపిస్తుంది.

Advertisement
CJ Advs

రామ్ చరణ్ వంటి స్టార్ హీరో పక్కన రంగస్థలంలో హాట్ హాట్ ఐటెం సాంగ్ చేసిన  పూజాహెగ్డే.... తర్వాత మహేష్ కెరీర్ లో మైలు రాయి లాంటి చిత్రం మహేష్ 25 లో వంశి పైడిపల్లి డైరెక్షన్ లో మహేష్ సరసన ఎంపికైంది. అదే బడా ఆఫర్ అనుకునేంతలో పూజాహెగ్డే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాలోనూ హీరోయిన్ గా అధికారికంగా ఫైనల్ అయ్యేసరికి ఆమెకున్న క్రేజ్ అర్ధమైంది. మరి అదే క్రేజ్ తో పూజా ప్రస్తుతం రాధా కృష్ణ - ప్రభాస్ ల కలయికలో తెరకెక్కే సినిమా హీరోయిన్స్ లోను పరిశీలనలో ఉండడమే కాదు పూజాహెగ్డేని ప్రభాస్ పక్కన ఫైనల్ చేసినట్లే అంటున్నారు.

మరి ఇలా ఒక్కసారిగా స్టార్ హీరోల పక్కన ఛాన్స్ లు కొట్టేసి స్టార్ హీరోయిన్ రేంజ్ కి అతి దగ్గరలోకి చేరిపోయింది. సమంత, రకుల్ ల క్రేజ్ తగ్గుతుండడంతో అమ్మడు ఒక్కసారిగా లక్కు కలిసొచ్చి ఇలా స్టార్ హీరోయిన్ అవతారమెత్తింది. అజ్ఞాతవాసి టైం లో అను ఇమ్మాన్యుయేల్ టాప్ చైర్ కి చేరుతుంది అనుకుంటే అమ్మడుకి ఆ సినిమా ఫలితం నిరాశనే మిగిల్చింది. ఈ టైం లోనే పూజా టాప్ చైర్ కి దగ్గరైపోయింది.

Pooja Hegde Tollywood Trend Setter:

Pooja Hegde in Tollywood Top stars Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs