Advertisement
Google Ads BL

చైతు, సమంత రొమాన్స్ స్టార్ట్ చేశారు!


గతంలో నాగ చైతన్య - సమంతలు కలిసి ఏమాయ చేసావే, ఆటో నగర్ సూర్య, మనం వంటి సినిమాలు కలిసి  చేసినప్పుడు లేని క్రేజ్ ఇప్పుడు కలిసి ఒకే సినిమా చేస్తుంటే మాత్రం ఎనలేని క్రేజ్ వచ్చేసింది. కారణం ఆ క్యూట్ కపుల్ ఇప్పుడు పెళ్లి చేసుకుని ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నట డిమాండ్ ఏర్పడింది. చైతు - సామ్ లు కలిసి నటిస్తుంటే సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని.. అందుకే వారిద్దరిని పెట్టి డైరెక్టర్ మారుతీ ఒక సినిమా చెయ్యాలనుకున్నాడు. కానీ చైతు అప్పట్లో ఆ ప్రపోజల్ కి ఒప్పుకోలేదు. అయితే చైతు - సామ్ లు కేవలం ఆన్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్ మీద కూడా రొమాంటిక్ కపుల్. మరి ప్రస్తుతం ఆఫ్ స్క్రీన్ కపుల్ గా అందరి నోళ్ళలో నానుతున్న ఈజంట తాజాగా కలిసి నటించడానికి ఒప్పుకున్నారు. శివ నిర్వాణం డైరెక్షన్ లో నాగ చైతన్య - సమంతలు కలిసి 'ప్రేయసి' (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమాలో నటిస్తున్నారు.

Advertisement
CJ Advs

మరి ఈ సినిమా కోసం ఈ జంట భారీ పారితోషకం అందుకుంటున్నారనే ప్రచారం కూడా ఉంది. ఇకపోతే ఈ రోజు శనివారం నాగ చైతన్య - సమంతలు కలిసి ఒకే కారులో  తాము కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ కి హాజరవడానికి వెళుతూ.... తామిద్దరూ కలిసి కారులో ఉన్న పిక్ తో పాటు 'ఇది డెఫినెట్లీ ఓ కొత్త రోజు.. షూటింగ్‌కు భార్యతో కలిసి వెళుతున్నా.. మీ రోజులో మరింత ఫన్ తోడు కాబోతోంది.. గుడ్ మార్నింగ్...' అంటూ స్వీట్ గా ట్వీట్ చేశాడు నాగ చైతన్య. మరి ఎంతో గాఢంగా నాలుగేళ్లకు పైగా ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరి పెళ్లి చేసుకున్న చైతు - సామ్ ల జంట ఇప్పుడు ఒకే సినిమాలో రొమాన్స్ చేస్తుండడంతో ఆ సినిమాపై అంచనాలే కాదు... సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Pic Talk: Chay, Sam Rehearsing Romance:

Naga Chaitanya, Samantha Join Work For Shiva Nirvana Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs