ఎఫైర్లు నడపడంలో తోటి హీరోయిన్లను ముగ్గులోకి దించడంలో తమిళంలో మన్మథునిగా శింబుకి పెద్ద ఘన కీర్తే ఉంది. నయనతార, హన్సికలతో పాటు ఆయన తనతో నటించిన హీరోయిన్లందరితో ఎఫైర్స్ పెట్టుకుంటారని కోలీవుడ్ మీడియా చెబుతుంది. ఇక త్రిష విషయానికి వస్తే ఈమె కూడా అదే టైప్. నాడు చెన్నైలో తాగి తన స్నేహితులతో ఆమె వీధుల్లో రచ్చ రచ్చ చేయడంతో వ్యవహారం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. ఇక సుచీ లీక్స్‌లో కూడా త్రిష, రానాల ముద్దుముచ్చట్లు, ధనుష్‌తో పాటు పలువురితో త్రిష కనిపించింది. అలాంటి శింబు, త్రిషలు తమ కెరీర్ మొదట్లో బాగానే క్లోజ్‌గా ఉండేవాడు. నాడు వారి మద్య ఎఫైర్ నడించిందని కూడా పలు వార్తలు వచ్చాయి. నాడు వీరిద్దరు కలిసి నటించిన రెండు చిత్రాలు మంచి హిట్ అయ్యాయి. వీరిద్దరి స్క్రీన్‌కెమిస్ట్రీ అదిరిపోయింది. అదే సమయంలో రీల్‌లైఫ్‌లోనే కాదు. రియల్‌లైఫ్‌లో కూడా వీరి వ్యవహారం హాట్‌టాపిక్ అయింది.
కాగా ఆ మద్య త్రిషకి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ ఫైనాన్షియర్. ఆయనకు శింబుకి పడదు. దాంతో త్రిషకి ముందుగానే శింబుని పిలవవద్దని గట్టిగా చెప్పాడు. కానీ ఎంగేజ్‌మెంట్ సమయానికి త్రిష పిలుపుతో శింబు అక్కడ వాలిపోయాడు. తన నిశ్చితార్ధం జరుగుతుండగానే ఆమె శింబుకి హాట్‌హాట్ కిస్ ఇవ్వడం, వరుడు అలగడం జరిగి ఈ నిశ్చితార్ధం ఆగిపోయింది. ఇక వీరిద్దరు కలిసి నటించిన ఓ చిత్రం 'విన్నైతాండి వరువయా'. ఈ చిత్రం అప్పట్లో ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం దానికి సీక్వెల్ రూపొందుతోంది. ఈ సందర్భంగా శింబు.. త్రిష గురించి మాట్లాడుతూ, అప్పట్లో నాకు త్రిషకి ఎఫైర్‌ఉందని వచ్చిన వార్తల్లో నిజం లేదు. నాకు చిన్ననాటి నుంచి త్రిష తెలుసు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ అందరు చెప్పే విషయాన్నే సరికొత్తగా చెప్పినట్లు ఫీలైపోతున్నాడు.