Advertisement
Google Ads BL

అమితాబ్‌ గురించి కంగారు పడొద్దు: జయా!


జరిగేది గోరంత అయితే సోషల్‌మీడియా దానిని కొండంత చేస్తుంది. తాజాగా బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌కి తీవ్ర అస్వస్థత వచ్చిందని, ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని వార్తలు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేశాయి. కానీ ఆయన అస్వస్థత పాలైంది నిజమే గానీ అది చాలా చిన్న విషయమేనట. ఈయన ప్రస్తుతం విజయ్‌ ఆచార్య దర్శకత్వంలో అమీర్‌ఖాన్‌తో కలిసి 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ జోధ్‌పూర్‌లో జరుగుతోంది. ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్‌ బాగా బరువుగా, అసౌకర్యంగా ఉండటంతో ఆయనకు వెన్నునొప్పి వచ్చిందట. దాంతో ఆయన్ను జోధ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకి చికిత్స అందించేందుకు డాక్టర్ల బృందం ముంబై నుంచి జోద్‌పూర్‌ చేరుకుంది. ఈ విషయం గురించి అమితాబ్‌ బచ్చన్‌ భార్య జయాబచ్చన్‌ క్లారిటీ ఇచ్చింది. 

Advertisement
CJ Advs

అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది. కాస్టూమ్స్‌ బరువుగా ఉండటం వల్ల వెన్నునొప్పి, మెడనొప్పి వచ్చాయి తప్ప అంతకు మించి ఏమీ లేదని తెలిపింది. ఇక ప్రస్తుతం బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌ 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌'లో అమీర్‌ఖాన్‌తో, రిషికపూర్‌తో కలిసి '102 నాటౌట్‌' అనే చిత్రాలలో నటిస్తున్నాడు. ఇక ఆయన చిరంజీవి నటించే 151వ ప్రతిష్టాత్మక చిత్రం 'సై..రా.. నరసింహారెడ్డి'లో కీలకపాత్రను చేయడానికి ఒప్పుకున్నాడు. 

ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. వచ్చేనెలలో రెండో షెడ్యూల్‌ ఉంటుందని, అందులో అమితాబ్‌బచ్చన్‌తో పాటు నయనతార కూడా పాల్గొననుందని సమాచారం. ఇక అమితాబ్‌ మరో రెండు మూడు రోజుల్లో తన అస్వస్థతపై తానే క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. 

Jaya Bachchan Breaks Silence On Amitabh Bachchan’s Health:

After docs reach Jodhpur to check on Big B, Jaya Bachchan confirms actor is doing fine 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs