నటి పూనమ్ కౌర్ మొన్నా మధ్యన కత్తి మహేష్ పుణ్యమా అని ఒక్కసారిగా వార్తల్లోకొచ్చింది. పవన్ కి వీరాభిమాని అయిన పూనమ్ కౌర్ ని కత్తి మహేష్ టార్గెట్ చేసి ఒక రోజంతా పలు ఛానల్స్ లో రచ్చ రచ్చ చేశాడు. అసలు మహేష్ కత్తి పూనం కి పవన్ కళ్యాణ్ కి మధ్య ఏదో ఉందని.... అది బయటపెట్టాలంటూ నానా హంగామా చేశాడు. ఆతర్వాత పూనమ్ కౌర్ బ్రదర్ లైన్ లోకి రావడం ఏదో చెప్పేసి ఆ కథని అక్కడితో ముగించెయ్యడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలకు బ్రాడ్ అంబాసిడర్ గా పూనమ్ కౌర్ తరుచు ఏదో ఒక ఫొటోతో సోషల్ మీడియాలో కనబడుతూనే ఉంది.
అయితే నిన్న గురువారం పూనమ్ కౌర్ చేసిన ఒక ట్వీట్ మళ్ళీ ఆమెని వార్తల్లో నిలిచేలా చేసింది. మరి పూనమ్ కౌర్ ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్ చేసిందో గాని... ఇప్పుడా ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ పూనమ్ చేసిన ఆ ట్వీట్ ఏమిటంటే.. 'కాన్సెప్ట్స్ కాపీ చేసి, డైలాగ్స్ కాపీ చేసి బట్టలు మార్చుకుంటూ.... మనుషులను మారుస్తూ... మాటమీద ఉండకపోవడం.... జనాల ఇన్నోసెన్స్ తో ఆడుకుంటూ.... వేషభాషలు మారుస్తూ..... జనాలను మభ్యపెట్టి.... అమ్మాయిలను అడ్డం పెట్టుకుంటూ.... రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది..... ఆ భగవంతుడే.... నిజం ఏంటో అని తెలియచేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అంటూ ఘాటుగా ట్వీట్ చేసింది.
అయితే పూనం ట్వీట్ చేసింది మాత్రం పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే అంటూ ఒక గాసిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే నిన్నమొన్నటి వరకు టిడిపిని పల్లెత్తు మాట అనని పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిడిపి ప్రభుత్వాన్ని మాటల తూటాలతో ఏకి పారేశాడు. సీఎం చంద్రబాబు కొడుకు నారా లోకేష్ అవినీతి పరుడంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే . మరి తనకి చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ పదవి ఇచ్చిన టిడిపి ప్రభుత్వాన్ని పవన్ తిట్టడం వలెనే పూనమ్ కౌర్ పవన్ ని టార్గెట్ చేసిందా..? ఏమో ఆ దేవుడికే తెలియాలి పూనమ్ టార్గెట్ చేసిన వ్యక్తి ఎవరనేది. అయితే నిజంగా ఈ పోస్ట్ ఆమె చేసిందా? ట్విట్టర్ లో ఉమెన్స్ డే తరువాత ట్వీట్ చేయని పూనమ్... ఫేస్ బుక్ లో ఇలా పోస్ట్ చేయడం చర్చనీయాంశం అవుతుంది. ఆమె పేరు మీద ఎవరో దీనిని రన్ చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పూనమ్ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.