Advertisement
Google Ads BL

ప్రియా.. మరోసారి వార్తల్లోకి..!


చాలామందికి ఓవర్‌నైట్‌లో స్టార్‌డమ్‌ వస్తుంది. కానీ స్టార్‌డమ్‌ సాధించడం ఒక ఎత్తైతే దానిని నిత్యం కాపాడుకుంటూ ఉండటం మరో ఎత్తు. వీక్షకులను నిత్యం ఏదో ఒక వార్తతో వార్తల్లో నానేలా చూసుకోవడం అందరికీ సాద్యమయ్యే పని కాదు. అది ఎవరో వర్మ వంటి వారికి మాత్రమే సాధ్యం. కానీ తాజాగా సోషల్‌మీడియా సెన్సేషన్‌గా మారిన ప్రియా ప్రకాష్‌ వారియర్‌ మాత్రం చిన్నతనంలోనే ఆ తెలివిని సాధించుకుందని చెప్పాలి. 'ఒరు ఆధార్‌ లవ్‌'లోని పాటలో హావభావాలతో క్రేజ్‌ తెచ్చుకున్న ఆమె తర్వాత తాను ఇష్టపడే హీరోల గురించి మాట్లాడింది. ఆ తర్వాత తనకి మొబైల్‌ ఉందేగానీ అందులో సిమ్‌ లేదని, తన కాలేజీలో మోడ్రన్‌ డ్రస్‌లు వేసుకోనివ్వరని, తన తల్లిదండ్రులు తనకి సొంత మొబైల్‌ కూడా ఇవ్వరని చెప్పింది. 

Advertisement
CJ Advs

తర్వాత బాలీవుడ్‌లో తెలుగు 'టెంపర్‌'కి రీమేక్‌గా రణవీర్‌సింగ్‌తో కలిసి 'సింబా' చిత్రంలో నటిస్తోందని, తెలుగులో కూడా ఓ చిత్రం ఒప్పుకుందని ఇలా ప్రతి రోజు ఈమె గురించి ఏదో ఒక వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టేలా చేస్తూ తానే హింట్స్‌ ఇచ్చింది. ఇక తాజాగా ఆమె తన ఫొటో షూట్‌తో మెస్మరైజ్‌ చేస్తోంది. ఈమెకి చెందిన ఫొటో షూట్‌ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. గులాబిరంగు లాంగ్‌ ఫ్రాక్‌లో ఉన్న ఆమె ఫోటోలు యువతకు పిచ్చెక్కిస్తున్నాయి. కేవలం ఈ ఫొటోషూట్‌ ద్వారానే ఆమెకి మరింత మంది అభిమానులు, సినిమా చాన్స్‌లు వచ్చేలా కనిపిస్తున్నాయి. 

కేవలం సోషల్‌మీడియాలో వైరల్‌ కావాలంటే బికినీలు, ఇతర గ్లామర్‌షోలతోనే కాదు.. ఇలా నిండుగా ఉన్న ప్రేక్షకులు, నెటిజన్లు ఆకర్షితులవుతారని ప్రియా వారియర్‌ తన ఫొటోషూట్‌తో నిరూపిస్తోంది. 

Priya Warrier Latest photoshoot Hulchal in Social Media :

Oru Adaar Love Actress Priya Warrier Latest photos Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs