బాబు మాటల మాంత్రికుడు. ఆయన ఏదైనా ఆచితూచే గాదు.. ఎంతో తెలివిగా ప్రజలంటే దద్దమ్మలుగా భావించి తనను తాను ఓమేధావిని అన్నట్లు బిహేవ్ చేస్తుంటాడు. ఇక పవన్ తాజాగా టిడిపిపై విమర్శలు ఎక్కుపెట్టడంతో ఆ సభ ముగిసిన తర్వాత చంద్రబాబు తనకు టచ్‌లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించాడు. ప్రత్యేకహోదా ఇవ్వని కేంద్రాన్ని ఏమీ అనకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తడం ఏమిటని ప్రశ్నించాడు. రాష్ట్రంలోని పార్టీలన్ని ఏకతాటిపైకి వచ్చి ప్రత్యేకహోదా కోసం పోరాడాల్సిన సమయంలో ఈ చవకబారు విమర్శలు ఏమిటి? 2014లో పవన్ టిడిపికి సపోర్ట్ చేసినప్పుడు మత్య్సకారులను ఎస్టీలో చేరుస్తామని మేనిఫెస్టోలో పెట్టిన సంగతి తెలిసిన పవన్ ఇప్పుడు కులాల మద్య చిచ్చుపెడుతున్నానని తప్పుపట్టారు.
ఇక చంద్రబాబు ఒక మత్స్యకారుల విషయం గురించి మాట్లాడుతున్నాడే గానీ మిగిలిన మేనిఫెస్టోలోని ఎన్నింటిని ఈ నాలుగేళ్లలో అమలు చేశాడు? కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వం అని చెబితే ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నావు? పవన్ నాడు ప్రత్యేకప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోలిస్తే అవే చాలని ఎందుకన్నావు? కేంద్రంలో బిజెపి రాష్ట్రానికి ఇప్పటి వరకు అదనంగా ఏమీ ఇవ్వలేదని చెబుతున్నప్పుడు ఇప్పుడే ఆయన ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇన్ని బడ్జెట్‌లలో ఆయనకు ఏపీకి జరుగుతున్న అన్యాయం తెలియదా? నాడు బడ్జెట్స్ అద్భుతంగా ఉన్నాయని చంద్రబాబు కేంద్రానికి కితాబునిచ్చింది నిజం కాదా? నిజంగా చంద్రబాబు, జగన్‌లకు మోదీ అన్నా, కేంద్రం అన్నా, ఏదైనా తేడా వస్తే తమపై కూడా కేంద్రం ప్రతీకారం తీర్చుకుంటుందనే విషయంలో వారు భయపడటం లేదా? ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వలేని కేంద్రమంత్రిని ఏపీ నుంచి రాజ్యసభకు ఎలా పంపించాడు? నాడు చంద్రబాబుకి జిగిరి దోస్త్ అయిన మంత్రి వెంకయ్యనాయుడు ఎన్నో సంస్థలను రాష్ట్రానికి తెస్తున్నాడని భజన చేసింది నిజం కాదా? రాష్ట్రానికి ఇన్ని కోట్ల పెట్టుబడులు, ఇన్ని విదేశీ సంస్థలు వచ్చాయంటున్నావు. అవి ఎక్కడ? అవి ఇంకా చర్యల స్థాయిలోనే ఉన్నప్పుడు చంద్రబాబు అందరూ రాష్ట్రానికి వచ్చేస్తున్నారు.
కంపెనీలు పెట్టేస్తున్నారని మభ్యపెడుతున్నాడు. ఇప్పటి వరకు ఆయన ఎంత మందికి ఉద్యోగాలు వచ్చేలాచేశాడు? బాబు వస్తే జాబు వస్తుందనే మాట ఏమైంది? కేంద్రం గురించి నాలుగేళ్లు మౌనంగా ఉన్న ఆయన రెండు మూడు రోజులు టిడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసన చేయగానే పోరాడినట్లు అవుతుందా? ఇంకా ఎన్డీయే నుంచి ఎందుకు బయటికి రాలేదు? అన్ని రాజకీయ పార్టీలు కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన సమయంలో ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు ఏమిటి? అని ప్రశ్నించడం కాదు.. అదే చిత్తశుద్ది ఉంటే చంద్రబాబు ప్రత్యేకహోదా విషయంలో ఇప్పటివరకు ఎందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్లలేదు? ప్రత్యేకహోదా కాదు.. ప్రత్యేక ప్యాకేజీనే ముద్దు అన్న చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేకహోదానే కావాలని ఆందోళన చేయడం ఏమిటి? ఇందులో ఏమైనా చిత్తశుద్ది ఉందా?
ప్రత్యేకహోదా కోసం టిడిపి, వైసీపీలు రెండు కేంద్రం గురించి భయపడుతుంటే ప్రజలకు ఇక మరో ప్రత్యామ్నయం ఏముంది? ఇద్దరు దొంగలలో ఎవరిని ఎంచుకోవాలి? అంటే ప్రజలు మాత్రం ఏమి చేయగలరు? ఇన్నేళ్ల నుంచి రైల్వే జోన్ కూడా తేలేకపోయిన చంద్రబాబు ఏమి సాధించాడు? అసలు సీఎం రమేష్‌లో ఏమి చూసి మరోసారి రాజ్యసభ ఎంపీ సీటు ఇచ్చాడు? ఏమి చేసి సుజనా చౌదరిని మంత్రిని చేశాడు? ప్రత్యేకహోదా ఉద్యమాన్ని పందుల పోటీతో పోల్చిన వారిని పీఠం ఎక్కించి నిజంగానే తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టి తాను కూడా జగన్ తానులో ముక్కనేనని నిరూపించుకుంటున్నా విషయం వాస్తవం...!