ఒకనాడు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చంద్రబాబునాయుడు అవినీతి విషయంలో ఎంతో కఠినంగా వ్యవహరించాడు. పల్లెబాట పట్టి పల్లెల్లో నిద్ర చేసి, ఆకస్మిక తనిఖీలతో అవినీతి, బాధ్యతారహిత ఉద్యోగులను హడలెత్తించేవాడు. కానీ రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఉద్యోగులలో మరలా అవినీతి విపరీతంగా పెరిగింది. పోలీస్, రెవిన్యూ, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్.. ఇలా ప్రతి రంగంలో అవినీతి తాండవిస్తోంది. కనీసం చంద్రబాబు వచ్చిన తర్వాత అయినా అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటాడని ఎందరో ఆశలు పెట్టుకున్నారు. కానీ నేడు అధికారులందరూ అధికార పార్టీ వారి ఆదేశానుసారం పనిచేస్తూ పనిలో పనిగా అవినీతిని బాహాటంగా పెంచి పోషిస్తున్నారు. కానీ చంద్రబాబులో చలనం లేదు. నిజంగా ఇప్పటి చంద్రబాబు నాటి చంద్రబాబు కాదనే చెప్పాలి. పోసాని కృష్ణమురళి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం చంద్రబాబు ఉద్యోగుల అవినీతి పట్ల కఠినంగా ఉంటే ఆయా ఓటు బ్యాంకు పోతుందని, ఏ కులానికి ఏమి చేస్తే, ఏ వర్గానికి ఏమి చేస్తే ఓట్లు వస్తాయని ఆలోచిస్తున్నాడే గానీ నిజంగా ఆయన నిజాయితీగా ప్రభుత్వాన్ని నడపడంతో విఫలం అవుతున్నాడు.
నాడు తాత్కాలికమైన సంక్షేమ పథకాల కంటే అభివృద్ది ముఖ్యమని చెప్పిన చంద్రబాబు నేడు అవే ప్రజాకర్షణ పథకాలలో మునిగితేలుతున్నాడు. రంజాన్, సంక్రాంతిలకు పప్పులు బెల్లాలు పంచుతున్నాడు. కోట్ల ఖర్చుని వృదా చేస్తున్నాడు. వైఎస్‌కి కేవలం సంక్షేమ పథకాల వల్లే పేరు రావడం, ఆయనలాగా తాను కూడా సంపాదించి ఆ డబ్బుతో జగన్‌ని ఎదుర్కోమని తన పార్టీ వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఇక ఓటుకు నోటు సంగతి తెలిసిందే. ఇక నారాలోకేష్ అయితే ప్రభుత్వాన్ని ఆయనే శాసిస్తున్నాడు. వైజాగ్‌లో భూకుంభకోణం, అగ్రిగోల్డ్ బాధితులు, ఫ్లోరైడ్ బాధితులు, ఉద్దానం సమస్య, రైతులు, ఇలా అన్నింటిలోనూ వైఫల్యం కనిపిస్తోంది. చంద్రబాబు తాను అవినీతికి పాల్పడుతున్నాడో లేదో తెలియదు గానీ లోకేష్ మాత్రం జిల్లాల వారిగా తన హవా చూపిస్తున్నాడు. అందిన కాడికి దోచుకుంటూ జగనే ఆదర్శంగా నడుస్తున్నాడు. ఇక రాజధానికి రెండువేల ఎకరాలు చాలని చెప్పి, పవన్ చెప్పినట్లు నేడు దానిని లక్ష ఎకరాల దాకా తీసుకుని వచ్చాడంటే ఆయా ప్రాంతాలలో టిడిపి నాయకులు భారీ రియల్ ఎస్టేట్‌కి కేంద్రంగా మార్చి భూములను కొనడమే కారణం. మురళీమోహన్ నుంచి మంత్రి నారాయణ వరకు చంద్రబాబు, లోకేష్‌లకు బినామి అనే మాట వినిపిస్తోంది.
ఇక ప్రజల్లో కూడా అవినీతి అంటే కామన్ అనే వ్యవహారంగా వచ్చింది. జగన్ దోచుకోలేదా? అని టిడిపి వారు అంటుంటే మీరు దోచుకోవడం లేదా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తు, ప్రశ్నకి సమాధానం చెప్పకుండా, విమర్శకి ప్రతి విమర్శ మాత్రమే చేస్తున్నారు. నిజానికి లోకేష్ కరెప్షన్, ఆయన కన్నుసన్నల్లో అన్ని నడవడం విషయం బహిరంగ విషయమే. మరి పవన్ చెప్పినట్లు 2014లో ఉన్నట్లు 2019లో ఉండదనే చెప్పాలి. పవన్ వామపక్షాలతో కలిసి వెళ్లితో చంద్రబాబుకి నష్టం... కాంగ్రెస్ బలపడితే వైసీపీకి నష్టం. ఇలా పవన్ గొప్పగా సీట్లు గెలవకపోయినా కూడా ఇతరుల గెలుపును ప్రభావితం చేసేలా కీలక పాత్ర పోషిస్తాడు.