Advertisement
Google Ads BL

'దంగల్‌' చిన్నది ఏం చేస్తోందో చూడండి!


అమీర్‌ఖాన్‌ నటించిన 'దంగల్‌' చిత్రంలో ఆయనతో పోటీగా నటించిన ఆయన కూతురు పాత్రధారి సనా ఫాతిమాషేక్‌. ప్రముఖ రెజ్లర్‌ మహావీర్‌ సింగ్‌ పొగట్‌ బయోపిక్‌గా ఈ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. ఇందులో ఫాతిమా సనా షేక్‌ గీతా పొగట్‌గా నటించి మెప్పించింది. చైనాలో అయితే ఈ చిత్రం విడుదలైతే ఇందులో అమీర్‌ ఖాన్‌ కన్నా చైనీయులు ఫాతిమా సనా షేక్‌కి ఫిదా అయ్యారు. ఇక ఈమె ఒకనాటి బాలనటి. తెలుగులో కమల్‌హాసన్‌ హీరోగా వచ్చిన 'భామనే సత్యభామనే', హిందీ రీమేక్‌లో ఈమె బాలనటిగా, ఆ తర్వాత ఓ లోబడ్జెట్‌ తెలుగు చిత్రంలో హీరోయిన్‌గా కూడా నటించింది. 

Advertisement
CJ Advs

ఇక ఈమె ప్రస్తుతం అమీర్‌ఖాన్‌, అమితాబ్‌, కత్రినాకైఫ్‌లు నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌'లో కీలకపాత్రను చేస్తోంది. విజయ్‌ ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం కోసం ఫాతిమా ఎంతో కష్టపడుతోంది. 'దంగల్‌' చిత్రంలోని పాత్రకు పూర్తి విరుద్దమైన విభిన్నమైన పాత్రను చేస్తోన్న ఆమె తాజాగా జిమ్‌లో డంబుల్స్‌ ఎత్తుతూ, తీవ్రంగా వర్కౌట్స్‌ చేస్తున్న వీడియోను ఓ అభిమాని తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. సనా ఇలా వర్కౌట్స్‌ చేస్తుండగా అక్కడే తిరుగుతున్న అమీర్‌ఖాన్‌ ఆమె వెనుక అద్దంలో కనిపిస్తూ అలరిస్తున్నాడు. 

ఇలా అనుకోకుండా వీడియోలో అమీర్‌ ఖాన్‌ కనిపిస్తూ ఉండటంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. మరి 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌'లో సనా చేసిన పాత్ర ఏమిటి? 'దంగల్‌'ని మించేలా ఆమె మరోసారి ప్రపంచాన్ని మెప్పిస్తుందా? లేదా? అన్నది వేచిచూడాల్సివుంది....!

Dangal Fatima Sana Shaikh Gym Hot Workout:

Dangal Sana's Video Hulchal in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs