Advertisement
Google Ads BL

జాన్వి సినిమా సీన్స్ లీక్‌ అయ్యాయి..!


ఇటీవల హఠాన్మరణం చెందిన అతిలోక సుందరి శ్రీదేవి అభిమానులు ఆ బాధ నుంచి ఇంకా బయట పడకపోయినా ఆమె పెద్ద కుమార్తె జాన్వి నటిస్తున్న తొలిచిత్రం 'ధడక్‌'ని చూసి, శ్రీదేవిలో జాన్విని చూసుకుంటూ ఆ బాధని మర్చిపోవాలని అనుకుంటున్నారు. అలాంటి సమయంలో సినిమా విడుదల ఇంకా చాలా నెలలు ఉండగానే ఈ చిత్రంలోని ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ధర్మ ప్రొడక్షన్స్‌ అధినేత కరణ్‌జోహార్‌ ఈ లింకులను తీసివేశాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. జాన్వీ లుక్‌ని, ఆమె క్యారెక్టర్‌ తీరుని పలువురు చూసేశారు. ఇది నిజంగా పెద్ద షాక్‌ అనే చెప్పాలి. మొదటి సారిగా వెండితెరపై చూడాల్సిన జాన్విని ఇప్పుడు అరచేతిలో చూసేస్తే సినిమా విడుదలైన తర్వాత మజా ఏముంటుంది చెప్పండి..! 
ఇక షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్‌ ఖట్టర్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మరాఠి చిత్రమైన 'సైరత్‌'కి రీమేక్‌గా రూపొందుతోంది. తెలుగువారికి ఇలాంటి స్టోరీలు బాగానే అలవాటు ఉన్నా బాలీవుడ్‌కి మాత్రం కొత్తేనని చెప్పాలి. ఈ చిత్రానికి శశాంక్‌ ఖైతాన్‌ దర్శకుడు కాగా జూన్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ఈ లీకేజీపై మండిపడిన కరణ్‌జోహార్‌ ఇక నుంచి ఎవ్వరూ షూటింగ్‌ స్పాట్‌లకు మొబైల్స్‌ తీసుకుని రావద్దని ఆర్డర్‌ పాస్‌ చేశాడట. ఇక జాన్వి నటిస్తున్న ఈ 'ధడక్‌' చిత్రంకు శ్రీదేవితో సన్నిహితురాలైన కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌ ఫరాఖాన్‌ పనిచేస్తోంది. 
ఆమె మాట్లాడుతూ, జాన్వి వయసు నాటికే శ్రీదేవి సూపర్‌స్టార్‌ అని కాబట్టి జాన్విని శ్రీదేవితో పోల్చవద్దని కోరింది. తన కెరీర్‌ ప్రారంభంలో శ్రీదేవి తనని ఎంతో సపోర్ట్‌ చేసిందని చెప్పిన ఆమె జాన్వి కూడా డ్యాన్స్‌లు అద్భుతంగా చేస్తోంది. చెప్పిన వెంటనే పట్టేయడం జాన్విలో గొప్పతనమని చెప్పుకొచ్చింది. 

Advertisement
CJ Advs

Janhvi Kapoor, Ishaan Khattar Dhadak Scenes Leaked:

Dhadak makers ban phones on sets after clips leak online
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs