Advertisement
Google Ads BL

సుక్కుతో మళ్లీనా..! అలాంటిదేం లేదంట!


రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా వుంది. విడుదలకు సమయం దగ్గర పడడంతో సినిమా ప్రమోషన్స్ ని కూడా వేగవంతం చేసింది చిత్ర బృందం. సుకుమార్ ఈ సినిమాని పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. అయితే సుకుమార్ వర్కింగ్ స్టయిల్ కి మెచ్చిన రామ్ చరణ్, సుకుమార్ తో మరో సినిమా చేయాలని అనుకోవడమే కాదు... ఏకంగా సుకుమార్ కి కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ నుండి అడ్వాన్స్ కూడా ఇచ్చాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement
CJ Advs

మాములుగా అయితే సుకుమార్ తాను చేస్తున్న సినిమా పూర్తిగా కంప్లీట్ అయ్యి విడుదలయ్యే వరకు తన తదుపరి చిత్రాన్ని గురించి పట్టించుకునే వ్యక్తి కాదు. అలాంటప్పుడు చరణ్ నుండి అడ్వాన్స్ ఎలా తీసుకుంటాడు అంటున్నారు. కాకపోతే రామ్ చరణ్ మాత్రం సుకుమార్ పని పట్ల పాజిటివ్ గా వున్నాడని అంటున్నారు. కానీ వెంటనే మరో సినిమా చేసేంత అయితే లేదు కానీ... మళ్ళీ ఫ్యూచర్ లో సుకుమార్ తో రామ్ చరణ్ పని చేసే అవకాశం లేకపోలేదంటున్నారు కొందరు. కాకపోతే రామ్ చరణ్, సుకుమార్ లు రంగస్థలం స్పందన చూశాక మరో కథ ఏదైనా సెట్ అవుతుంది అనిపిస్తే అప్పుడు ఆలోచిద్దామని జస్ట్ ఓ మాట అనుకున్నారట.

అంతేగాని సుకుమార్ కొణిదెల కంపెనీ నుండి అడ్వాన్స్ తీసుకున్నాడు అనే మాట మాత్రం అబద్ధమట. ఇకపోతే సుకుమార్ - చరణ్ కాంబోలో వస్తున్న రంగస్థలం మాత్రం భారీ అంచనాల నడుమ మార్చి 30 నే ప్రేక్షకుల ముందుకు రానుంది. రంగస్థలం గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తూ విలన్ గా నటిస్తున్న జగపతి బాబు, అలాగే జగపతి బాబుకి పోటీగా చిట్టి బాబు అన్న కుమార్ ఆది పినిశెట్టి పోటీ చేసే అంశాలతో ఈ సినిమా సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అంటున్నారు.

No Movie after Rangasthalam in Sukku and Charan Combo:

Rumours on Ram Charan and Sukumar Combination after Rangasthalam 1985
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs