Advertisement
Google Ads BL

టైటిల్ గురించి తేజు క్లారిటీ ఇచ్చేశాడు..!


'సుప్రీమ్' తర్వాత హిట్‌ కోసం మొహం వాచిపోయి ఎదురుచూస్తున్నాడు మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌. ఇకనైనా ఆయన తన మావయ్యల ముద్ర నుంచి బయటకు వచ్చి వరుణ్‌తేజ్‌లా సొంతగా ప్రూవ్‌ చేసుకోవాలని కొందరు సలహా ఇస్తుంటే మెగాస్టార్‌ పాటలను, టైటిల్స్‌ని రామ్‌చరణ్‌ కాకుండా సాయిధరమ్‌తేజ్‌ వాడుకోవడం పట్ల కొందరు మెగాభిమానులలో కూడా భిన్నాభిప్రాయలు ఉన్నాయి. ఇక 'తిక్క, విన్నర్‌, నక్షత్రం, జవాన్‌'లని నుంచి వినాయక్‌ చిత్రమైనా కూడా 'ఇంటెలిజెంట్‌'కి కనీస వసూళ్లు రాకపోవడం ఆయనకు ఆందోళన కలిగిస్తోంది. 

Advertisement
CJ Advs

ఇదే సమయంలో ఆయన తన చిన్నమామయ్యకి 'తొలిప్రేమ' వంటి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన లవ్‌ మూవీస్‌ స్పెషలిస్ట్‌ కరుణాకరన్‌తో ఓ చిత్రం చేస్తున్నాడు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బేనర్‌లో తన పెదమామయ్య చిరంజీవికి ఎన్నో మెమరబుల్‌ హిట్స్‌ ఇచ్చిన కె.ఎస్‌.రామారావు ఈ చిత్రానికి నిర్మాత. ఇక రెండు రోజులుగా ఈ చిత్రం టైటిల్‌ ఫిక్స్‌ అయిందని, 'దేవుడు వరమందిస్తే' అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ వార్తలపై తేజూ స్పందించాడు. 

ఈ చిత్రానికి ఇంకా ఏ టైటిల్‌ని నిర్ణయించలేదు. త్వరలో టైటిల్‌ ప్రకటిస్తామని తేల్చిచెప్పాడు. దాంతో 'దేవుడు వరమందిస్తే' అనేది ఆ చిత్రం టైటిల్‌ కాదని తేలిపోయింది. ఇక ఇప్పుడు మెగా యంగ్‌ హీరోలు ఒక మాట మీదకి వచ్చారట. ఇటీవల జరిగిన మెగాడాటర్‌ సుస్మిత బర్త్‌డే సందర్భంగా కొత్తగా మెగాఫ్యామిలీ నుంచి వస్తున్న చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్‌ కూడా వచ్చాడు. ఇక నుంచి మెగా కాంపౌండ్‌లో ఎవరి వద్దకు ఏ కథ వచ్చినా, కథ బాగున్నా తమ ఇమేజ్‌కి సరిపోదని భావిస్తే వాటిని ఇతర మెగా హీరోలకు పంపాలని నిర్ణయించారని తెలుస్తోంది. 

తద్వారా మెగా ఫ్యామిలీ నుంచి ఎక్కువ హిట్‌ చిత్రాలు వస్తాయనే నమ్మకం ఉందని అంటున్నారు. మరి బన్నీకి ఏదైనా కథ వచ్చి ఆయనకున్న ఇమేజ్‌కి అది సరితూగకపోతే సాయిధరమ్‌తేజ్‌ వద్దకు ఏదైనా హిట్‌ కథ వస్తుందో లేదో చూడాల్సివుంది...! 

Sai Dharam Tej Gave Clarity on Karunakaran Movie title:

Sai Dharam Tej Clarity on His Karunakaran Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs