Advertisement
Google Ads BL

అబ్బే.. అంతా ఉత్తుత్తి పుకార్లేనంటోంది!


పదహారణాల తెలుగమ్మాయి, వైజాగ్‌ భామ గౌతమి. ఈమె 'గాంధీనగర్‌ రెండో వీధి'లో రాజేంద్రప్రసాద్‌ సరసన నటించి, చంద్రమోహన్‌, సుమన్‌ వంటి వారి సరసన నటించిన తర్వాత కోలీవుడ్‌పై దృష్టి పెట్టింది. తమిళంలో ఈమె కమల్‌హాసన్‌తో చేసిన చిత్రాలన్నీ మంచి పేరు ప్రఖ్యాతులు సాధించడంతో పాటు సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. అదే సమయంలో ఆమె కమల్‌ లిప్‌కిస్‌ మత్తులో పడి ఆయనతో సహజీవనం చేసింది. ఇక ఈమె అంతకు ముందే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఏడాదికే ఆయనకు విడాకులిచ్చింది. వారికి పుట్టిన పాపే సుబ్బులక్ష్మి. 

Advertisement
CJ Advs

ఇక గౌతమి కమల్‌తో సహజీవనం చేసే సమయంలో శృతిహాసన్‌, అక్షరహాసన్‌లను కూడా తన సొంత కూతుర్లలాగా చూసుకుంది. ఇక ఆమెకి క్యాన్సర్‌ ఎటాక్‌ కావడం, కమల్‌ పట్టించుకోకపోవడంతో పాటు పలు అభిప్రాయ భేదాల వల్ల వారు ఇప్పుడు విడిపోయారు. ఈమె ఇప్పుడు తన కూతురుకి మంచి భవిష్యత్తు ఇవ్వడమే తన ముందున్న ఏకైక లక్ష్యంగా చెబుతోంది. ఇక ఈమె తన కుమార్తెని కూడా హీరోయిన్‌ని చేయాలని భావిస్తోందని, సరైన తెరంగేట్రం కోసం వెయిట్‌ చేస్తోందని వార్తలు వచ్చాయి. ఇక తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'అర్జున్‌రెడ్డి' చిత్రం ప్రస్తుతం తమిళంలో రీమేక్‌ అవుతోంది. సినిమా టైటిల్‌ 'వర్మ'. దీనికి అత్యద్భుత దర్శకుడు బాల డైరెక్టర్‌గా పనిచేస్తుండగా, చియాన్‌ విక్రమ్‌ కుమారుడు దృవ్‌ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే అతను గడ్డం పెంచిన ఫొటో బాగా వైరల్‌ అవుతోంది. ఈచిత్రం ద్వారా హీరోయిన్‌గా షాలిని పాండే స్థానంలో సుబ్బులక్ష్మి ఎంపికైందని వార్తలు వస్తున్నాయి. విక్రమ్‌ కుమారుడి మొదటి చిత్రం కావడం, దేశం గర్వించదగ్గ బాలా దర్శకుడు కావడంతో అందరు ఇది నిజమేనని నమ్మారు. 

కానీ తాజాగా ఈ విషయంపై గౌతమి స్పందించింది. ఈ చిత్రంలో తన కుమార్తె సుబ్బులక్ష్మి నటించడం లేదని, ప్రస్తుతం ఆమె దృష్టి అంతా చదువు మీదే ఉందని, మీ అందరి ఆశీర్వాదాలు తన కుమార్తెకి కావాలని కోరింది. ఇకపోతే ఈ రీమేక్‌లో ఎవరిని హీరోయిన్‌గా తీసుకుంటారు? అనే అంశం ఆసక్తిని కలిగిస్తోంది. బోల్డ్‌ పాత్ర, లిప్‌కిస్‌లు ఉండే దీనిలో బోల్డ్‌ నటినే తీసుకుంటారా? లేక కొత్తమ్మాయిని ఎంపిక చేస్తారా? అనేది వేచిచూడాల్సివుంది..! 

Gouthami Gives Clarity About Her Daughter Subbalakshmi Movie Entry:

Subbalakshmi is committed to her studies and has no plans for acting now. Thank you all for your blessings on her: Gautami
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs