లెజెండ్ భామ ఈ మధ్యన తెగ సంచలనాలకు నెలవుగా మారింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లలో సినిమాలు చేస్తూ ఉన్న రాధికా ఆప్టేకి అదిరిపోయేంతటి ఆఫర్స్ మాత్రం రావడం లేదు. అందుకే అమ్మడుకి కడుపుమండినప్పుడుడల్లా అందరిని ఏకి పారేస్తోంది. మొన్నామధ్యన సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చెయ్యడమే కాదు.... హీరోలు కూడా తక్కువ వారు కాదని వారిని వదలకుండా మాట్లాడేసింది. మళ్ళీ కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న రాధికా ఆప్టే మరోమారు ఆ కాస్టింగ్ కౌచ్ మీద మళ్ళీ హాట్ హాట్ ఆరోపణలు చేసింది. కొన్ని విషయాలను ఓపెన్ గానే చెప్పేసి ఔరా అనిపించింది.
అదేమిటనేట్ రాధికా ఆప్టే చేసిన తొలి దక్షిణాది సినిమాలో నటించేటప్పుడే రాధికా ఆప్టే కి లైంగిక వేధింపులు ఎదురయ్యాయట. తాను నటించిన ఒక సౌత్ మూవీలో నటించిన ఆ టాప్ హీరో రాధికా ఆప్టేతో అసభ్యంగా ప్రవర్తించగా.. ఒళ్ళుమండిన రాధికా ఆప్టే ఆ హీరోగారి చెంప పగలగొట్టిందట. ఈ విషయాలని రాధికా ఆప్టేనే స్వయంగా చెప్పింది. బాలీవుడ్ లో నేహా దుపియా చేస్తున్న షోలో రాధికా పలు సంచలన విషయాలను బయటపెట్టి హాట్ టాపిక్ గా మరింది. సౌత్ లో టాప్ హీరోగా ఉన్న అతను షూటింగ్ స్పాట్ లో తనని వేధించాడని... నా కాలు మీద కాలు వేసి రుద్దుతుంటే ఒళ్ళుమండిన నేను ఆ హీరో చెంప పగలగొట్టానని చెబుతుంది.
అసలు అంతకు ముందు ఆ హీరో గురించి తనకేం తెలియదని.... అలాగే టాలీవుడ్ అయితే హీరోల ఆధిపత్యం ఎక్కువని కూడా రాధికా ఘాటుగా స్పందించింది. సినిమాల్లో మంచి అవకాశాలతో హీరోయిన్స్ పాతుకు పోవాలంటే లైంగిక వేధింపులు ఎదుర్కోవాల్సిందేనని చెప్పి షాకింగ్ కామెంట్స్ చేసింది రాధికా.