ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హవా బాగా నడుస్తోంది. 'టెంపర్' వరకు వరస వైఫల్యాలను ఎదుర్కొన్న ఆయన ఆ తర్వాత 'టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్'లతో పాటు మామూలు కంటెంట్‌తో తీసిన 'జై లవ కుశ'కు కూడా భారీ కలెక్షన్లు తెప్పించుకోగలిగాడు. ఇక ప్రస్తుతం ఈయన తన 28వ చిత్రంగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చిత్రం చేయనున్నాడు. అది పూర్తయిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మైటీ మల్టీస్టారర్ ప్రారంభం కానుంది.
తాజాగా రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు కలిసి ఈ చిత్రం టెస్ట్ షూట్ కోసం అమెరికాలోని లాస్‌ఏంజెల్స్ వెళ్లారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న స్టిల్ ఒకటి హల్‌చల్ చేస్తోంది. ఈ ఫొటో హైదరాబాద్‌లోని జిమ్‌లో ఎన్టీఆర్ కష్టపడుతున్న ఫొటోలా అనిపిస్తోంది. దీంతో ఎన్టీఆర్ లాస్‌ఏంజెల్స్ నుంచి వచ్చేశాడని, త్రివిక్రమ్ చిత్రం కోసం మరలా కసరత్తులు మొదలుపెట్టాడని వార్తలు వస్తుంటే అది ఇప్పటి ఫొటో కాదు.. పాత ఫొటో అని కొందరు వాదిస్తున్నారు. ఇక ఈ జిమ్ వర్కౌట్స్ స్టిల్‌ని ఎన్టీఆర్ ట్రైనర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ఇది వైరల్ అవుతోంది. ఇక మరో విషయం ఏమిటంటే గత రెండు రోజుల నుంచి ఎన్టీఆర్ అమెరికాలో టెస్ట్ షూట్ సందర్భంగా గాయపడ్డాడని, తీవ్ర గాయాలయ్యాయని యూట్యూబ్ చానెల్స్‌లో వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఆందోళన చెంది విషయాన్ని ఎంక్వైరీ చేసే పనిలో పడ్డారు. కానీ ఎన్టీఆర్ సన్నిహితులు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్‌కి ఏమీ కాలేదని, ఆయన అమెరికా నుంచి వచ్చి జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడని తెలిపాడు. సో.... వైరల్ అవుతోన్న ఎన్టీఆర్ జిమ్ ఫొటో పాతది కాదు.. లేటెస్ట్‌దేనని, ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ కూడా వచ్చేశాడని స్పష్టమవుతోంది...!