Advertisement
Google Ads BL

వర్మపై నాగ్ కి ఎందుకో అంత నమ్మకం?


నాగార్జున కెరీర్‌ని మలుపు తిప్పింది 'గీతాంజలి'తో పాటు 'శివ' అని కూడా ఎవరైనా ఒప్పుకుంటారు. ఇక ఆ తర్వాత వర్మ -నాగ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'అంతం, గోవిందా గోవిందా' చిత్రాలు మెప్పించలేకపోయాయి. ఇక వర్మ ఫామ్‌ కోల్పోయాడని ఈయన గత కొంతకాలంగా తీస్తున్న చిత్రాలు చూస్తే అర్ధమవుతోంది. అలాంటి సమయంలో నాగ్‌ ఏకంగా వర్మకి మరో చాన్స్‌ ఇవ్వడంతో అందరు షాక్‌ అయ్యారు. ఈ చిత్రం గురించి వర్మతో పాటు నాగార్జున కూడా భలే గొప్పగా చెబుతున్నాడు. ట్రెండ్‌ సెట్టర్‌ అని, మైండ్‌ బ్లోయింగ్‌ అంటూ ట్వీట్స్‌ పెడుతున్నారు. ఇక దర్శకులు, కథల ఎంపికలో నాగ్‌ ఈమద్య చాలా జాగ్రత్తగా ఉన్నాడు. దాంతో ఈ చిత్రంలో సమ్‌థింగ్‌ ఏమీ లేకపోతే నాగ్‌ ఒప్పుకోడు కదా అనేది కూడా నిజమే. ఇక ఇది వర్మ బేనర్‌లో రూపొందుతోంది. కాబట్టి నాగ్‌కి ఇబ్బంది లేదు. కానీ వర్మకి మాత్రం ఇది డూ ఆర్‌ డై పరిస్థితి. ఏవో రెండు ఫొటోలు రిలీజ్‌ చేసి వచ్చేస్తున్నాం... బ్లాక్‌బస్టర్‌ ఇచ్చేస్తున్నాం అని కలరింగ్‌ ఇస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా నాగ్‌ ఈ చిత్రం 99శాతం పూర్తయింది. పూర్తి సినిమా కోసం ఎగ్జైటింగ్‌గా ఉన్నాను. వర్మని అతని టీమ్‌ని మిస్‌ అవుతున్నానని చెప్పాడు. నిజం చెప్పాలంటే 'ఆఫీసర్‌' చిత్రం నుంచి విడుదలైన ఫొటోలు ఎవ్వరినీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఏదో వర్మ స్టైల్‌లో రొటీన్‌గా, బిగ్రేడ్‌ చిత్రాల కోవలో కనిపిస్తున్నాయి. అయినా ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు కాబట్టి మే 25న ఈ 'ఆఫీసర్‌' వచ్చే వరకు వెయిట్‌ చేస్తే గానీ వర్మ నాగ్‌ని ఏం చేశాడో చెప్పలేం...! ఇక నాగ్‌ తదుపరి చిత్రం అశ్వనీదత్‌ బేనర్‌లో నానితో కలిసి చేసే మల్టీస్టారర్‌ మూవీ ఉగాది నాడు ప్రారంభం కానుంది. 'శమంతకమణి' తీసిన శ్రీరాం ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో నాగ్‌, నానిలు మాఫియాడాన్‌, డాక్టర్లుగా నటిస్తున్నారు. ఇక నాగ్‌ సరసన అమలాపాల్‌ ఎన్నికైందని తెలుస్తోంది.

Officer Regular Shoot Completes:

<span>Nagarjuna and RGV Tweets on Officer</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs